Share News

Mumbai: పలు విమాన సర్వీసులు దారి మళ్లింపు

ABN , Publish Date - Jul 08 , 2024 | 02:33 PM

గత అర్థరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో ముంబై మహానగరం తడిసి ముద్దయింది. మహానగరంలోని పలుప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. అలాగే రహదారులన్నీ జలమయమైనాయి.

Mumbai: పలు విమాన సర్వీసులు దారి మళ్లింపు

ముంబై, జులై 08: గత అర్థరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో ముంబై మహానగరం తడిసి ముద్దయింది. మహానగరంలోని పలుప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. అలాగే రహదారులన్నీ జలమయమైనాయి. దీంతో జనజీవనం అస్తవ్యప్తంగా మారింది. ఆ క్రమంలో పలు రైళ్లను రద్దు చేశారు. అలాగే 27 విమాన సర్వీసులను సైతం దారి మళ్లించారు. గత అర్థరాత్రి 1.00 గంట నుంచి ఈ రోజు ఉదయం 7.00 గంటల వరకు 300 మి.మి వర్షపాతం నమోదయిందని బృహన్ ముంబై నగర పాలక సంస్థ ఉన్నధికారులు వెల్లడించారు.

ఈ భారీ వర్షాల కారణంగా.. అందేరి, కుర్లా, కింగ్స్ సర్కిల్, విల్లే పార్లె, దాదర్ తదితర ప్రాంతాలు నీట మునిగాయి. మరోవైపు ఈ వర్షాల కారణంగా మహానగర పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు ఒక పూట సెలవును ప్రభుత్వం ప్రకటించింది. భారీ వర్షాలు కారణంగా వాతావరణం సరిగ్గా లేకపోవడంతో పలు విమాన సర్వీసులను సైతం దారి మళ్లించారు.


ఇక వాతావరణ ప్రతికూల పరిస్థితులతోపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమంది. ఈ నేపథ్యంలో విమాన ప్రయాణ సమయాన్ని ముందుగా చెక్ చేసుకోవాలని ప్రయాణికులకు ముంబై ఎయిర్ పోర్ట్ అధికారులు సూచించారు. అనుకున్న సమయం కంటే ముందుగానే ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవాలని వారికి విజ్జప్తి చేశారు.

మరోవైపు రైల్వే ట్రాక్‌‌పైకి భారీగా వర్షం నీరు వచ్చి చేరింది. ఈ నేపథ్యంలో స్థానిక రైళ్లతోపాటు పలు రైళ్లను రద్దు చేసినట్లు మధ్య రైల్వే జీఎం రామ్‌కరణ్ యాదవ్ ప్రకటించారు. అలాగే మరికొన్ని రైళ్లను దారి మళ్లించామని వివరించారు. అయితే మరి అత్యవసరం అయితేనే కానీ బయటకు రావద్దని ముంబై మహానగర ప్రజలకు ఉన్నతాధికారులు సూచించారు.

Read Latest News And National News

Updated Date - Jul 08 , 2024 | 04:15 PM