Haryana Elections: హరియాణాలో ప్రశాంతంగా సాగుతున్న పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రముఖులు
ABN , Publish Date - Oct 05 , 2024 | 09:29 AM
హరియాణా అసెంబ్లీ ఎన్నికల(Haryana Assembly Elections 2024) పోలింగ్ ప్రారంభమైంది. చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది.
చండీగఢ్: హరియాణా అసెంబ్లీ ఎన్నికల(Haryana Assembly Elections 2024) పోలింగ్ ప్రారంభమైంది. చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. రాష్ట్రంలోని మొత్తం 90 స్థానాలకు 1,031 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఉదయం 7 గంటల ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 20 వేల 632 పోలింగ్ కేంద్రాల్లో 2 కోట్ల మందికి పైగా ప్రజలు ఓటు హక్కు వినియోగించనున్నారు.
బీజేపీ అధికారంలో ఉన్న హరియాణాలో ఈ సారి ఎన్నికలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. తిరిగి అధికారంలో నిలబెట్టుకోవాలని చూస్తున్న బీజేపీకి విపక్ష కాంగ్రెస్ సవాలు విసురుతోంది. ఇక్కడ జాట్ సామాజిక వర్గం ప్రధానంగా ఉంది.
బీజేపీ సర్కార్ తీరుపై ఆ వర్గంలో కొంత వ్యతిరేకత నెలకొనగా.. జాటేతర వర్గాలను ఆకర్షించి ఓట్లు పొందాలని అధికార పార్టీ చూస్తోంది. కాంగ్రెస్ జాట్‌లు, ముస్లిం వర్గాల ఓట్లపై ప్రధానంగా ఫోకస్ పెట్టింది. దీర్ఘకాలంగా అధికారంలో ఉండటంతో ప్రజల్లో పెరిగిన వ్యతిరేకతతోపాటు కుల సమీకరణాలు బీజేపీకి ఈసారి ప్రతికూలంగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
వివరాలు..
నియోజకవర్గాలు 90
అభ్యర్థులు 1,031
మహిళలు 101
స్వతంత్ర అభ్యర్థులు 464
ట్రాన్స్‌జెండర్లు 467
పోలింగ్ కేంద్రాల సంఖ్య 20,632
రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,03,54,350
వారిలో పురుషులు 1,07,75,957
మహిళలు 95,77,926
Hyderabad: రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం.. గుండెపోటుతో..
For Latest news and National News click here