Hero Vijay: త్వరలో హీరో విజయ్ రాష్ట్ర వ్యాప్త పర్యటన
ABN , Publish Date - Oct 30 , 2024 | 11:47 AM
విక్రవాండి వద్ద నిర్వహించిన తొట్టతొలి మహానాడు విజయవంతం కావటంతో రెట్టింపు ఉత్సాహంతో తమిళగ వెట్రి కళగం నేత, సినీ హీరో విజయ్(Movie hero Vijay) త్వరలో రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు. మహానాడు విజయవంతమయ్యేందుకు కృషిచేసిన పార్టీ నేతలందరికీ ఆయన ధన్యవాదాలు తెలుపుతూ మంగళవారం ఓ లేఖ రాశారు. మాజీ ముఖ్యమంత్రి అన్నాదురైలా తాను పార్టీ శ్రేణులకు తరచూ లేఖలు రాసి వారిలో ఉత్సాహాన్ని నింపాలని నిర్ణయించుకున్నానని విజయ్ పేర్కొన్నారు.
- జయం మనదేనంటూ పార్టీ శ్రేణులకు లేఖ
చెన్నై: విక్రవాండి వద్ద నిర్వహించిన తొట్టతొలి మహానాడు విజయవంతం కావటంతో రెట్టింపు ఉత్సాహంతో తమిళగ వెట్రి కళగం నేత, సినీ హీరో విజయ్(Movie hero Vijay) త్వరలో రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు. మహానాడు విజయవంతమయ్యేందుకు కృషిచేసిన పార్టీ నేతలందరికీ ఆయన ధన్యవాదాలు తెలుపుతూ మంగళవారం ఓ లేఖ రాశారు. మాజీ ముఖ్యమంత్రి అన్నాదురైలా తాను పార్టీ శ్రేణులకు తరచూ లేఖలు రాసి వారిలో ఉత్సాహాన్ని నింపాలని నిర్ణయించుకున్నానని విజయ్ పేర్కొన్నారు. 2026లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం ఖాయమని, ఆ దిశగా పార్టీ శ్రేణులంతా పాటుపడాలని పిలుపునిచ్చారు.
ఈ వార్తను కూడా చదవండి: PM Modi: పశ్చిమ బెంగాల్, ఢిల్లీలోని వృద్ధులకు ప్రధాని మోదీ క్షమాపణలు.. కారణం ఎందుకంటే..
ఇక దీపావళి తర్వాత 234 శాసనసభ నియోజకవర్గాలలో సుడిగాలి పర్యటన జరిపేందుకు విజయ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతినియోజకవర్గంలో నాలుగైదు చోట్ల రోడ్‌షోలు నిర్వహించాలని నిర్ణయించారు. దీపావళి(Diwali) తర్వాత పార్టీ ప్రముఖులు, నాయకులతో ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. విజయ్ ప్రస్తుతం హెచ్ వినోద్ దర్శకత్వంలో నటిస్తున్న 69వ చిత్రం షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. పదిరోజులపాటు ఆ సినిమా షూటింగ్‌లో ఆయన పాల్గొన్నారు. మరో రెండు మూడు రోజుల్లో ఆయన సినిమా షూటింగ్‌కు వెళ్ళనున్నారు. మే నెలాఖరువరకు ఆ సినిమా షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది. ఆ షూటింగ్ గ్యాప్‌లో ఆయన పార్టీ వ్యవహారాలపై దృష్టిసారించనున్నారు.
సినిమా షూటింగ్ పూర్తికాగానే ఆయన పూర్తిగా రాజకీయాలకే అంకితమవుతారని అనుచరులు చెబుతున్నారు. ఓ వైపు డీఎంకేని, మరో వైపు జాతీయ పార్టీ బీజేపీపై మహానాడులో దుమెత్తిపోసిన విజయ్.. అన్నాడీఎంకే(AIADMK)తో దోస్తీకడతారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఆ దిశగానే రెండు పార్టీల నాయకులు రహస్యంగా మంతనాలు కూడా చేస్తున్నారని తెలుస్తోంది. మహానాడులో తమ పార్టీని విమర్శించకపోవడం వల్ల అన్నాడీఎంకే కూటమిలో విజయ్ పార్టీ చేరటం ఖాయమేనని డీఎంకే, దాని మిత్రపక్షాలు కూడా చెబుతున్నాయి. ప్రస్తుతం ఎన్నికల సమయంలో పొత్తులపై దృష్టిసారించవచ్చునని, అంతకంటే ముందు రాష్ట్రప్రజలను నేరుగా కలుసుకోవాలని విజయ్ నిర్ణయించారు. ఆ దిశగానే దీపావళి తర్వాత ప్రధానంగా నియోజకవర్గాల వారీ పర్యటనపైనే దృష్టిసారించనున్నారు.
...................................................................
ఈ వార్తను కూడా చదవండి:
......................................................................
High Court: మాజీసీఎంకు షాకిచ్చిన హైకోర్టు.. విషయం ఏంటంటే..
- మళ్లీ విచారణకు రూ.1.77 కోట్ల అక్రమాస్తుల కేసు
చెన్నై: మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం(Former Chief Minister O. Panneerselvam)పై నమోదైన అక్రమాస్తుల కేసు మళ్లీ విచారించాలని మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. 2001 నుంచి 2006 వవరకు అన్నాడీఎంకే(AIADMK) ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన పన్నీర్‌సెల్వం, ఆదాయానికి మించి రూ.1.77 కోట్ల ఆస్తులు కూడబెట్టారంటూ డీఎంకే ప్రభుత్వంలో కేసు నమోదైంది. హైకోర్టు మదురై డివిజన్ బెంచ్ ఉత్తర్వులతో ఈ కేసు విచారణ మదురై జిల్లా కోర్టు నుంచి శివగంగ జిల్లా కోర్టుకు బదిలీ చేశారు.
అనంతరం అధికారం బదిలీ జరిగి అన్నాడీఎంకే నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడడంతో, పన్నీర్‌సెల్వం, ఆయన కుటుంబ సభ్యులను ఈ కేసు నుంచి విడుదల చేస్తూ 2012లో శివగంగ జిల్లా కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఈ కేసును మళ్లీ విచారించేలా మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి ఆనంద్ వెంకటేశన్ సుమోటాగా స్వీకరించి విచారించారు. ఈ కేసు విచారణకు స్టే విధించాలని కోరుతూ పన్నీర్‌సెల్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ తోసివేతకు గురైంది. ఈ నేపథ్యంలో, ఒ.పన్నీర్‌సెల్వంపై ఉన్న కేసును మళ్లీ విచారించాలంటూ మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది.
ఈ ఉత్తర్వుల్లో... కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తే జామీనును మదురై ప్రత్యేక కోర్టు రద్దు చేయవచ్చని, కేసుకు సంబంధించిన దస్తావేజులు మదురై ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు నవంబరు 27వ తేదిలోపు బదిలీ చేయాలని, రోజు వారీ విచారణ చేపట్టి 2025 జూలై నెలలోపు మదురై ప్రత్యేక కోర్టు ముగించాలని పేర్కొన్నారు. ఈ కేసులో నేరారోపణలు ఎదుర్కొంటున్న పన్నీర్‌సెల్వం సతీమణి సహా ఇద్దరు మృతిచెందడంతో వారిపై ఉన్న కేసులు ఉపసంహరించుకున్నట్లు న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: రాష్ట్రంలో మట్టి రోడ్డు లేకుండా చేస్తాం
ఈవార్తను కూడా చదవండి: యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు 7,037 కోట్ల అదనపు రుణం
ఈవార్తను కూడా చదవండి: KTR : కాంగ్రెస్ దాడులను ఎదుర్కొందాం
ఈవార్తను కూడా చదవండి: టీజీఎస్పీ పోలీసుల వైఖరిపై నిఘా
Read Latest Telangana News and National News