Share News

Fake Threat Calls: ఫేక్ బెదిరింపు కాల్స్‌.. ఏవియేషన్ సెక్యూరిటీ సంచలన నిర్ణయం!

ABN , Publish Date - Jun 19 , 2024 | 07:08 PM

ఈమధ్య కాలంలో ఎయిర్‌పోర్టులకు, విమానయాన సంస్థలకు ఫేక్ బెదిరింపు కాల్స్ రెగ్యులర్‌గా వస్తున్నాయి. ఫలానా విమానంలో బాంబు ఉందంటూ.. గుర్తు తెలియని దుండగులు ఈ-మెయిల్...

Fake Threat Calls: ఫేక్ బెదిరింపు కాల్స్‌.. ఏవియేషన్ సెక్యూరిటీ సంచలన నిర్ణయం!
Hoax Callers May Face Five Years Ban From Flying

ఈమధ్య కాలంలో ఎయిర్‌పోర్టులకు, విమానయాన సంస్థలకు ఫేక్ బెదిరింపు కాల్స్ (Fake Threat Calls) రెగ్యులర్‌గా వస్తున్నాయి. ఫలానా విమానంలో బాంబు ఉందంటూ.. గుర్తు తెలియని దుండగులు ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులకు దిగడం పరిపాటి అయిపోయింది. ఇలాంటి ఫేక్ కాల్స్ వల్ల.. ఆయా సంస్థల యాజమాన్యాలతో పాటు ప్రయాణికులూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే.. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫేక్ బెదిరింపు కాల్స్‌కు చెక్ పెట్టేందుకు గాను.. కఠిన చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతోంది.


Read Also: బాలిక హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్.. పోర్న్ వీడియోలకు బానిసై..

ఎవరైతే ఈ ఫేక్ కాల్స్ కేసుల్లో దోషులుగా తేలుతారో.. వారిపై ఐదేళ్ల పాటు విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించాలని బీసీఏఎస్ యోచిస్తోంది. అంతేకాదు.. కఠిన చర్యలు కూడా తీసుకోవాలని భావిస్తున్నట్టు పేర్కొంది. త్వరలోనే ఈ ప్రతిపాదనని విమానయాన మంత్రిత్వశాఖ ముందు ఉంచనున్నట్టు తెలిపింది. ప్రస్తుతం ఈ విషయంలో మూడు నుంచి ఆరు నెలలపాటు మాత్రమే నిషేధం ఉంది. అలాగే.. ఏ ఎయిర్‌లైన్స్‌కి నిందితులు ఫేక్ కాల్స్ చేస్తారో, దానివరకు మాత్రమే నిషేధం వర్తించేలా నిబంధన ఉంది. కానీ.. బీసీఏఎస్ ఇప్పుడు ఆ నిషేధకాలాన్ని ఐదేళ్లకు పెంచడంతో పాటు అన్ని సంస్థల విమానాలకూ వర్తింపజేయాలని చూస్తోంది. మరి.. మంత్రిత్వ శాఖ నుంచి ఇందుకు ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి.


Read Also: ఆసుపత్రిలో ఇదేం పాడుపని.. డాక్టర్, నర్సు కలిసి..

ఇదిలావుండగా.. ఒక్క బుధవారం (18/06/24) నాడు ఏకంగా 41 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ కారణంగా.. ఎయిర్‌పోర్టుల్లో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న విమానాల్ని ఆపేసి తనిఖీలు నిర్వహించడం, ప్రయాణికుల కోసం ఇతర విమానాల్ని సిద్ధం చేయడం వంటివి నిర్వహించాల్సి వచ్చింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన అధికారులు.. దీని వెనుక ఎవరున్నారని విచారించగా, ఒక మెయిల్ ఐడీ నుంచి మెయిల్స్ వచ్చినట్లు తేలింది. మధ్యాహ్నం 12:40 గంటల సమయంలో ఈ మెయిల్స్ వచ్చాయి. వీటి వెనుక ‘కేఎన్‌ఆర్‌’ అనే ఆన్‌లైన్‌ గ్రూపు ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Read Latest National News and Telugu News

Updated Date - Jun 19 , 2024 | 07:08 PM