Indian Crew: భారత్ మాతా కీ జై అంటూ నావికాదళానికి థాంక్స్..కారణమిదే
ABN , Publish Date - Jan 06 , 2024 | 01:44 PM
ఉత్తర అరేబియా సముద్రంలో లైబీరియన్ జెండాతో కూడిన వాణిజ్య నౌక హైజాక్ అయిన క్రమంలో అప్రమత్తమైన భారత నావికాదళం(indian navy) శుక్రవారం వెంటనే రంగంలోకి దిగి వారి చర్యలను కట్టడిచేసింది. అంతేకాదు వారిని సురక్షితంగా రక్షించి తీసుకురాగా..తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో వారు భారత్ మాతా కీ జై అంటు నేవీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఉత్తర అరేబియా సముద్రంలో లైబీరియన్ జెండాతో కూడిన వాణిజ్య నౌక హైజాక్ అయిన క్రమంలో అప్రమత్తమైన భారత నావికాదళం శుక్రవారం వెంటనే రంగంలోకి దిగి వారి చర్యలను కట్టడిచేసింది. ఈ క్రమంలో నేవీ(indian navy) చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ చూసి బెదిరిపోయిన హైజాకర్లు పారిపోయారు. ఆ నేపథ్యంలో కమాండోస్ 15 మంది భారతీయులతో సహా మొత్తం 21 మంది సిబ్బందిని రక్షించారు. అయితే ప్రస్తుతం వారిని రక్షించబడిన భారతీయుల మొదటి వీడియో వెలుగులోకి వచ్చింది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Viral Video: గూగుల్ స్ట్రీట్ కెమెరాలో చిక్కిన దెయ్యం?
వీడియోలో సిబ్బంది ఎంతో ఉత్సాహంతో నవ్వుతూ కనిపిస్తున్నారు. అంతేకాదు వారు 'భారత్ మాతా కీ జై'(bharat mata ki jai) అని అంటూ నినాదాలు చేస్తూ భారత నౌకాదళానికి కృతజ్ఞతలు తెలుపారు. ఐదు నుంచి ఆరుగురు సాయుధ సముద్రపు దొంగలు లైబీరియన్ జెండా ఉన్న ఓడను హైజాక్ చేయడానికి ప్రయత్నించారు. ఆ క్రమంలో సమాచారం తెలుసున్న భారత మార్కోస్ కమాండోస్ 15 మంది భారతీయులతో సహా మొత్తం 21 మంది సిబ్బందిని ఐఎన్‌ఎస్ చెన్నై యుద్ధనౌక ద్వారా ఆపరేషన్ సురక్షితంగా కాపాడారు.
నౌకాదళం MV లీలా నార్ఫోక్ నౌకకు సహాయంగా ఒక యుద్ధనౌక, సముద్ర గస్తీ విమానం P-8I, హెలికాప్టర్లు, MQ9B ప్రిడేటర్ డ్రోన్‌లను సైతం మోహరించింది. ఈ క్రమంలో యుద్ధనౌక INS చెన్నై శుక్రవారం మధ్యాహ్నం 3:15 గంటలకు కార్గో షిప్‌ను అడ్డగించిందని భారత నౌకాదళ ప్రతినిధి కమాండర్ వివేక్ మధ్వల్ తెలిపారు. ఆ క్రమంలోనే భారత మార్కోస్ కమాండోలు దానిపై ఆపరేషన్ నిర్వహించి సిబ్బందిని రక్షించారు.