Share News

J&K Encounter Video: బారాముల్లాలో తీవ్రవాదిని కాల్చి చంపిన సైనికులు.. వీడియో వైరల్..

ABN , Publish Date - Sep 16 , 2024 | 12:54 PM

జమ్ము, కశ్మీర్‌లోని బారాముల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రధాని మోదీ పర్యటనకు ముందు జరిగిన ఈ ఎన్‌కౌంటర్ తీవ్ర కలకలం రేపింది. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన డ్రోన్ ఫుటేజ్ తాజాగా బయటకు వచ్చింది

J&K Encounter Video: బారాముల్లాలో తీవ్రవాదిని కాల్చి చంపిన సైనికులు.. వీడియో వైరల్..
J&K Encounter Video

జమ్ము, కశ్మీర్‌ (Jammu and Kashmir)లోని బారాముల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌ (Baramulla Encounter)కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రధాని మోదీ (PM Modi) పర్యటనకు ముందు జరిగిన ఈ ఎన్‌కౌంటర్ తీవ్ర కలకలం రేపింది. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన డ్రోన్ ఫుటేజ్ తాజాగా బయటకు వచ్చింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. బారాముల్లాలోని ఓ ఇంట్లో టెర్రరిస్ట్ దాక్కున్నాడని సమాచారం అందుకున్న సైన్యం వెంటనే ఆ ఇంటిని చుట్టుముట్టింది. ఉగ్రవాది దాక్కున్న ఆ ఇంటిపై బుల్లెట్ల వర్షం కురిపించింది (J&K Encounter Video).


సైన్యం కాల్పుల కారణంగా ఆ టెర్రరిస్ట్ (Terrorist) రైఫిల్ పట్టుకుని ఇంటి నుంచి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఒకచోట కింద పడిపోయాడు. కాసేపు కాల్పులు జరిపాడు. ఆ తర్వాత మెల్లిగా లేచి ఓ గోడ పక్కన దాక్కున్నాడు. సైన్యం ఆ గోడపై బుల్లెట్ల వర్షం కురిపించింది. అక్కడి నుంచి తెల్లని పొగ బయటకు రావడం వీడియోలో కనిపించింది. శనివారం రాత్రి జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో భారత సైన్యం మొత్తం ముగ్గురు తీవ్రవాదులను హతమార్చింది. పాక్ సైన్యం సహకారంతోనే ఈ తీవ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.


ఈ నెలలో జమ్ము, కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు (J&K Assembly Elections) జరగబోతున్నాయి. 18వ తేదీన జరిగే తొలి విడత ఎన్నికల్లో జమ్ము, కశ్మీర్‌లోని 24 స్థానాల్లో పోలింగ్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలను ఆపేందుకు పాకిస్తాన్ వైపు నుంచి ఉగ్ర ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. సరిహద్దు రేఖ దగ్గర దాదాపు 80 మంది తీవ్రవాదులు కశ్మీర్‌లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నట్టు సైన్యం గుర్తించింది. వీరికి పాకిస్తాన్ సైన్యం, రేంజర్లు సహకరిస్తున్నట్టు భారత సైన్యం అనుమానిస్తోంది.

ఇవి కూడా చదవండి..

Delhi CM: తదుపరి ఢిల్లీ సీఎం ఎవరు?.. రేసులో ఉన్నది వీళ్లే!


Narendra Modi: ప్రధాని మోదీ పుట్టినరోజు నేపథ్యంలో.. 13 ఏళ్ల చిన్నారి స్పెషల్ గిఫ్ట్


మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 16 , 2024 | 12:54 PM