Share News

Lok Sabha Election Schedule 2024: ఏడు దశల్లో ఎన్నికలు.. ఏ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు..!?

ABN , First Publish Date - Mar 16 , 2024 | 02:38 PM

Loksabha Polls Schedule 2024: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ వచ్చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిసా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌‌ను ప్రకటించింది...

Lok Sabha Election Schedule 2024: ఏడు దశల్లో ఎన్నికలు.. ఏ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు..!?

Live News & Update

  • 2024-03-16T18:00:00+05:30

    మేం రెఢీ!

    లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వేళ ప్రధాని మోదీ స్పందించారు. ఆయన ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. "ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండుగ వచ్చింది. 2024 లోక్‌సభ ఎన్నికల తేదీలను EC ప్రకటించింది. ఎన్డీయే కూటమి ఎన్నికలకు పూర్తిగా సిద్ధమయింది. సుపరిపాలన, అన్ని రంగాల ప్రజలకు చేసిన సేవల ఆధారంగా ప్రజల వద్దకు వెళ్తున్నాం. పదేళ్ల క్రితం యూపీఏ హయాంలో ప్రజలు మోసపోయారు. కుంభకోణాలు, అవినీతికి ఇండియా కూటమి కేరాఫ్‌గా మారింది. అప్పటి నుంచి ఒక్కో రంగంలో అవినీతిని అరికడుతూ.. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమపాళ్లలో అందిస్తున్నాం. మా ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ పథకాలు దేశంలోని అన్ని ప్రాంతాలకు చేరాయి. దేశం అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఈ అభివృద్ధికి చేయూతనివ్వడానికి ప్రజలు సిద్ధమయ్యారు.

    ఇప్పుడు దేశ ప్రజలంతా ఒకటే అంటున్నారు. అదే అబ్ కీ బార్.. మోదీ సర్కార్.. 400 పార్ అని. ఇండియా కూటమి చుక్కాని లేని నావలాంటిది. మనల్ని అబాసుపాలు చేసి రాజకీయ లబ్ధి పొందాలని వాళ్లు ఎప్పటికీ చూస్తుంటారు. అవినీతి, కుటుంబ పాలనే వారిని ఘోరంగా దెబ్బ తీసింది. త్వరలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా అవతరించనుంది. యువత కలలను నెరవేర్చడానికి మా సర్కార్ కృషి చేస్తోంది. రానున్న ఎన్నికల్లో మళ్లీ మేమే అధికారం చేపడతాం. వచ్చే 5 ఏళ్లలో వెయ్యేళ్ల భారత భవిష్యత్తును సాక్షాత్కరిస్తాం. మహిళా శక్తి, యువత, రైతులు, కార్మికులు.. ఇలా సమాజంలోని అన్ని వర్గాల అండ మాకుంది”అని పేర్కొంటూ మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

    modi.jpg

  • 2024-03-16T16:15:24+05:30

    ఏ దశలో ఎన్ని రాష్ట్రాలు..?

    • మొదటి దశ : 21 రాష్ట్రాల్లో ఎన్నికలు

    • రెండో దశ : 13 రాష్ట్రాల్లో ఎన్నికలు

    • మూడో దశ : 12 రాష్ట్రాల్లో ఎన్నికలు

    • నాలుగో దశ : 10 రాష్ట్రాల్లో ఎన్నికలు

    • ఐదో దశ : 08 రాష్ట్రాల్లో ఎన్నికలు

    • ఆరో దశ : 07 రాష్ట్రాల్లో ఎన్నికలు

    • ఏడో దశ : 08 రాష్ట్రాల్లో ఎన్నికలు

      cec1.jpg

  • 2024-03-16T16:10:38+05:30

    ఏ దశలో ఎన్ని స్థానాలకు ఎన్నికలు!

    • ఏడు దశల్లో పార్లమెంట్ ఎన్నికలు

    • ఏ దశలో ఎన్ని స్థానాల్లో జరుగుతాయో ప్రకటించిన ఈసీ

    • మొదటి దశ : 102

    • రెండో దశ : 89

    • మూడో దశ : 94

    • నాలుగో దశ : 96

    • ఐదో దశ : 49

    • ఆరో దశ : 57

    • ఏడో దశ : 57

  • 2024-03-16T16:00:28+05:30

    ఏడు దశలు.. తేదీలు ఇలా..!

    • దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్

    • ఏప్రిల్ : 19 తొలిదశ ఎన్నికలు

    • ఏప్రిల్ : 26న రెండో దశ పోలింగ్

    • మే : 07 మూడో దశ పోలింగ్

    • మే : 13 నాలుగో దశ పోలింగ్

    • మే : 20 ఐదో దశ పోలింగ్

    • మే : 25 ఆరో దశ పోలింగ్

    • జూన్ : 01 ఏడో దశ పోలింగ్

    Elections-Stages.jpg

  • 2024-03-16T15:57:57+05:30

    ఎన్ని దశల్లో పోలింగ్..!

    • దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్

    • ఏప్రిల్ : 19న తొలిదశ ఎన్నికలు

    • ఏప్రిల్ : 26న రెండో దశ పోలింగ్

    • తొలి దశలో అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో ఎన్నికలు

    • మే-13న ఏపీ, ఒడిశా, తెలంగాణలో ఎన్నికలు

    • మే-13న ఏపీ, తెలంగాణలో ఒకే రోజు పోలింగ్

    • ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్.. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు మాత్రమే పోలింగ్

    Schedule-Dates.jpg

  • 2024-03-16T15:50:07+05:30

    ఏపీలో ఎప్పుడంటే..?

    • ఏప్రిల్‌: 18న అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్‌

    • ఏప్రిల్‌: 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ

    • మే : 13న ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌

    • జూన్‌: 04న కౌంటింగ్‌

    • నాలుగో విడతలో ఏపీలో ఎన్నికలు

  • 2024-03-16T15:47:27+05:30

    ఉప ఎన్నికలు ఎక్కడెక్కడ..?

    • దేశ వ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు బై పోల్

    • తెలంగాణలో ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక

    • తెలంగాణలో కంటోన్మెంట్ అసెంబ్లీకి బైపోల్

    • ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత

  • 2024-03-16T15:45:32+05:30

    వామ్మో ఇన్ని కోట్లా!

    • ఇటీవల జరిగిన 11 రాష్ట్రాల ఎన్నికల్లో రూ.3,400 కోట్లు సీజ్

    • రాజస్థాన్, తెలంగాణ, మధ్యప్రదేశ్, కర్ణాటక, చత్తీస్‌ఘడ్, మిజోరాం..

    • మేఘాలయ, నాగాలాండ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ డబ్బు పట్టుబడింది: రాజీవ్ కుమార్

  • 2024-03-16T15:42:10+05:30

    గొడవలొద్దు..!

    • గొడవలకు తావులేకుండా..

    • ప్రేమతో ప్రచారం చేసుకోండి

    • వివాదాలు జరిగితే మాత్రం కచ్చితంగా కఠిన చర్యలుంటాయ్: సీఈసీ రాజీవ్ కుమార్

  • 2024-03-16T15:40:35+05:30

    ఫిర్యాదులు ఇలా చేయండి..!

    • పోటీ చేస్తున్న అభ్యర్థుల పూర్తి వివరాలు కేవైసీ యాప్‌లో చూడవచ్చు

    • అభ్యర్థి పూర్తి వివరాలను ప్రతి ఓటరూ తెలుసుకోవచ్చు

    • ఓటర్లకు తాయిలాలు, నగదు పంపిణీ జరిగితే..

    • ఫొటో తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయవచ్చు

    • సీ- విజిల్‌ యాప్‌ ద్వారా ఓటర్లు ఫిర్యాదు చేయవచ్చు: సీఈసీ

  • 2024-03-16T15:36:03+05:30

    వలంటీర్లకు బిగ్ షాక్

    • వలంటీర్లకు చెక్‌ పెట్టిన కేంద్ర ఎన్నికల సంఘం

    • ఎన్నికల విధులకు దూరంగా వలంటీర్లు ఉండాల్సిందే..: సీఈసీ

    • కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ఎన్నికల్లో విధుల్లో ఉండకూడదన్న ఈసీ

  • 2024-03-16T15:32:37+05:30

    ఈసీ స్ట్రాంగ్ వార్నింగ్!

    • ఎన్నికల్లో హింసకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు : ఈసీ

    • వాలంటీర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎన్నికల్లో విధుల్లో ఉండకూడదు

    • బ్యాంక్ లావాదేవీలు, ఖాతాలపై ప్రత్యేక మానిటరింగ్

    • సోషల్ మీడియా పోస్టుల నియంత్రణకు ప్రత్యేక అధికారుల నియామకం

    • టీవీ, సోషల్‌ మీడియా ప్రకటనలపై నిరంతరం నిఘా

    • పోటీ చేస్తున్న అభ్యర్థుల పూర్తి వివరాలు కేవైసీ యాప్‌లో చూడవచ్చు

    • అభ్యర్థి పూర్తి వివరాలను ప్రతి ఓటరూ తెలుసుకోవచ్చు

    • ఓటర్లకు తాయిలాలు, నగదు పంపిణీ జరిగితే..

    • ఫొటో తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయవచ్చు: రాజీవ్‌ కుమార్‌

  • 2024-03-16T15:30:59+05:30

    జూన్ 16 లోపే..!

    • జూన్ 16 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది : ఈసీ

    • లోక్‌సభతో పాటు 4 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు

    • ఏపీ, ఒడిశా, అరుణాచల్‍ప్రదేశ్..

    • సిక్కిం అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్

  • 2024-03-16T15:26:45+05:30

    జమ్మూలో కూడా ఎన్నికలు

    • జమ్మూ కశ్మీర్‌లో కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది

    • అయితే ఎప్పుడు అనే విషయం ప్రకటించలేదు

  • 2024-03-16T15:25:41+05:30

    మొత్తం ఓటర్ల లెక్కలివీ..

    • 49.7 కోట్ల పురుష ఓటర్లు

    • 47.1 కోట్ల మహిళా ఓటర్లు

    • 18 నుంచి 19 ఏళ్ల వయసున్న ఓటర్లు 21 లక్షల మంది

    • వందేళ్లు దాటిన వారు 2 లక్షల 18 వేలు

    • 85 ఏళ్లు దాటిన ఓటర్ల సంఖ్య 82 లక్షలు

    • 85 ఏళ్లు దాటిన వారికి, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం

    • దేశవ్యాప్తంగా 48 వేలమంది ట్రాన్స్‌జెంటర్‌ ఓటర్లు

    • 88.4 లక్షల మంది దివ్యాంగ ఓటర్లు

    • 12 రాష్ట్రాల్లో పురుషుల కన్నా మహిళా ఓటర్లు ఎక్కువ

    • ప్రతి 1000 మంది పురుషులకు 948 మంది మహిళా ఓటర్లు

    • ఏప్రిల్‌ 1 వరకు ఓటర్ల జాబితాలో మార్పులకు అవకాశం

  • 2024-03-16T15:20:55+05:30

    ఎన్నికల కోడ్ వచ్చేసింది..

    • దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్

    • ఏపీ, ఒడిశా, అరుణాచల్‍ప్రదేశ్..

    • సిక్కిం, జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్

    • ఎలాంటి లోపం లేకుండా ఎన్నికలు జరపాలనేదే ఈసీ ప్రయత్నం

    • జూన్‌ 16లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తాం: రాజీవ్‌ కుమార్‌

    Elections-Schedule-2.jpg

  • 2024-03-16T15:15:23+05:30

    ఎన్నికల ప్రక్రియ ఎండింగ్ ఎప్పుడంటే..!

    • సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల

    • ఏపీ, ఒడిశా, అరుణాచల్‍ప్రదేశ్...

    • సిక్కిం, జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్

    • దేశపౌరులంతా ఓటు హక్కు వినియోగించుకోవాలి

    • దేశ వ్యాప్తంగా 96.8 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు..

    • కోటీ 80 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నారు

    • దేశవ్యాప్తంగా 10 లక్షల 50 వేల పోలింగ్‌ కేంద్రాలు

    • 55 లక్షల ఈవీఎంలను వినియోగిస్తున్నాం

    • జూన్‌ 16లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తాం: రాజీవ్‌ కుమార్‌

    • సార్వత్రిక ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా 55 లక్షల ఈవీఎంలు

    • 4 లక్షల వాహనాలను ఉపయోగిస్తున్నాం: రాజీవ్ కుమార్

    • దేశంలో 49.7 కోట్ల మంది పురుషులు..

    • 47.1 కోట్ల మంది మహిళా ఓటర్లుగా ఉన్నారు

    • 12 రాష్ట్రాల్లో పురుషుల కంటే..

    • మహిళా ఓటర్ల నిష్పత్తి ఎక్కువగా ఉంది:రాజీవ్ కుమార్

    • తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్న 1.8 కోట్ల మంది ఓటర్లు

    • 20 నుంచి 29 ఏళ్ల వయసు గల ఓటర్లు 19.47 కోట్లు

    Elections-Schedule.jpg

  • 2024-03-16T15:10:18+05:30

    అటు షెడ్యూల్.. ఇటు ఎన్నికల కోడ్!

    • షెడ్యూల్ ప్రకటించగానే అమల్లోకి ఎన్నికల కోడ్

    • జూన్ 16తో ముగియనున్న ప్రస్తుత లోక్‍సభ గడువు

    • మేలోగా ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలు..

    • ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‍ప్రదేశ్, సిక్కిం

    • గత లోక్‍సభ ఎన్నికలకు 2019 మార్చి 10న షెడ్యూల్ ప్రకటించిన ఈసీ

    • గత లోక్‍సభ ఎన్నికలకు ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు ఏడుదశల్లో పోలింగ్

    • గత లోక్‍సభ ఎన్నికలకు మే23న ఓట్ల లెక్కింపు

    • ఈసారి కూడా ఏప్రిల్-మేలో ఎన్నికలు నిర్వహించేలా ఈసీ ఏర్పాట్లు

    • షెడ్యూల్ ప్రకటించగానే అమల్లోకి ఎన్నికల కోడ్

    EC-02.jpg

  • 2024-03-16T15:00:15+05:30

    రెడీ.. 1,2,3 :-

    • ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తున్న ఎలక్షన్ కమిషన్

    • లోక్‌సభతో పాటు 4 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు

    EC.jpg

  • 2024-03-16T14:30:44+05:30

    లోక్‌సభ ఎన్నికలకు (Loksabha Polls) సంబంధించి షెడ్యూల్ వచ్చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిసా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌‌ను ప్రకటించింది. ముందుగా చెప్పినట్లుగానే శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలో ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌, కొత్త కమిషనర్లు జ్ఞానేశ్‌ కుమార్‌, సుఖ్‌బీర్‌ సంధూలతో కూడిన పూర్తిస్థాయి ఎన్నికల కమిషన్‌ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఎన్నికల తేదీలను వెల్లడించింది. ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు అనే విషయాలను ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ లైవ్‌, ‘ఆంధ్రజ్యోతి.కామ్‌’లో ఎప్పటికప్పుడు చూసేద్దాం రండి..