LokSabha Elections: రేపు గుజరాత్‌లో ఓటు వేయనున్న ప్రధాని మోదీ
ABN , Publish Date - May 06 , 2024 | 03:49 PM
ప్రధాని నరేంద్ర మోదీ... తన ఓటు హక్కును మంగళవారం వినియోగించుకోనున్నారు. అహ్మదాబాద్‌లోని నిషాన్ ఉన్నత పాఠశాలలో ఆయన తన ఓటు వేయనున్నారు. దేశవ్యాప్తంగా మూడో దశ పోలింగ్ రేపు జరగనుంది. అందులోభాగంగా గుజరాత్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు రేపే పోలింగ్ జరుగుతుంది.
గుజరాత్, మే 6: ప్రధాని నరేంద్ర మోదీ... తన ఓటు హక్కును మంగళవారం వినియోగించుకోనున్నారు. అహ్మదాబాద్‌లోని నిషాన్ ఉన్నత పాఠశాలలో ఆయన తన ఓటు వేయనున్నారు. దేశవ్యాప్తంగా మూడో దశ పోలింగ్ రేపు జరగనుంది. అందులోభాగంగా గుజరాత్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు రేపే పోలింగ్ జరుగుతుంది.
AP Elections: ఏపీలో మోదీ పర్యటనపై తెలు‘గోడు’ ఆసక్తి.. వరాలు ఉంటాయా..!?
మరోవైపు అహ్మదాబాద్ నగరంలోని ఆరు పాఠశాలలకు ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో పాఠశాలలకు శెలవులు ప్రకటించి.. డాగ్ స్క్వాడ్‌తో అణువణువు గాలింపు చర్యలు చేపట్టారు. ఆ క్రమంలో ఇవి నకిలీవని తెలిసింది. అయినా రేపు ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్ నగరానికి వస్తుండడంతో.. భద్రతను కట్టుదిట్టం చేశారు.
Bomb Threat: పాఠశాలలకు మళ్లీ బాంబు బెదిరింపులు..
ఇంకోవైపు గాంధీనగర్ నుంచి కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షా బరిలో దిగారు. ఆయన సైతం రేపు.. తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ మూడో దశలో మొత్తం 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 95 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ దశలో మొత్తం 1,351 మంది అభ్యర్థులు బరిలో దిగారు.
నరేంద్ర మోదీ.. వారణాసి లోక్‌సభ స్థానం నుంచి ముచ్చటగా మూడోసారి ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఆ క్రమంలో మే 13న వారణాసిలో ప్రధాని.. తన నామినేషన్ వేయనున్నారు. అనంతరం వారణాసిలోని కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత వారణాసిలో రోడ్ షోలో ప్రధాని పాల్గొనున్నారు.
Read Latest National News And Telugu news