Share News

Delhi : స్వదేశీ చిప్‌తో ఆర్మీ కోసం మొబైల్‌ బేస్‌ స్టేషన్‌

ABN , Publish Date - Jul 01 , 2024 | 05:47 AM

పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఇండియాలోనే అభివృద్ధి చేసిన సెమీ కండక్టర్‌(చిప్‌) సాయంతో భారత సైన్యం కోసం 4జీ మొబైల్‌ కమ్యూనికేషన్‌ బేస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు.

Delhi : స్వదేశీ చిప్‌తో ఆర్మీ కోసం మొబైల్‌ బేస్‌ స్టేషన్‌

  • దేశంలో ఇదే మొదటిసారి

  • 4జీ చిప్‌ను తయారు చేసిన బెంగళూరు సంస్థ సిగ్నల్‌చిప్‌

న్యూఢిల్లీ, జూన్‌ 30: పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఇండియాలోనే అభివృద్ధి చేసిన సెమీ కండక్టర్‌(చిప్‌) సాయంతో భారత సైన్యం కోసం 4జీ మొబైల్‌ కమ్యూనికేషన్‌ బేస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. బెంగళూరుకు చెందిన సిగ్నల్‌చిప్‌ అనే సంస్థ ఈ చిప్‌ను రూపొందించింది. ఇండియాలో స్వదేశీ సాంకేతికతతో తయారు చేసిన మొట్టమొదటి 4జీ చిప్‌ ఇదే కావడం విశేషం. ఈ చిప్‌తో సహ్యాద్రి పేరుతో వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌లో కీలకమైన నెట్‌వర్క్‌ ఇన్‌ బాక్స్‌(ఎన్‌ఐబీ)ను తయారు చేయగా.. ఆ ఎన్‌ఐబీలను భారత సైన్యం బిడ్డింగ్‌ ద్వారా సిగ్నలా్ట్రన్‌ అనే సంస్థ నుంచి సేకరించింది.

ఆర్మీకి మొత్తం 20 సహ్యాద్రి నెట్‌వర్క్‌ బాక్స్‌లను సరఫరా చేశామని సిగ్నలా్ట్రన్‌ వ్యవస్థాపకుడు హిమాంశు ఖాన్సిస్‌ తెలిపారు. సిగ్నల్‌ చిప్‌ కంపెనీని కూడా ఈయనే 2010లో ప్రారంభించారు. ‘‘4జీ, 5జీ నెట్‌వర్క్‌ల కోసం సిగ్నల్‌చిప్‌ సంస్థ చిప్‌లను తయారు చేసింది. పూర్తి స్వదేశీ సాంకేతికతతో చిప్‌లను తయారు చేయడం ఇండియాలో ఇదే మొదటిసారి. ఆర్మీలో సంక్లిష్టమైన కమ్యూనికేషన్‌ వ్యవస్థ కోసం స్వదేశీ చిప్‌ను ఉపయోగించడంతో భద్రతాపరంగా ఎంతో మేలు జరుగుతుంది’’ అని ఖాన్సిస్‌ చెప్పారు. 7కిలోల బరువు ఉండే సహ్యాద్రి నెట్‌వర్క్‌ ఇన్‌ బాక్స్‌ వ్యవస్థ అత్యంత నాణ్యమైన వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌ అందిస్తుందని చెప్పారు. ఇండియాలో ఇప్పుడు ఏర్పాటు చేసిన మెజారిటీ బేస్‌స్టేషన్లు ఇండియాలో తయారు చేసినవి కాదు. కొన్ని ఇక్కడ తయారైనవి అయినా కూడా వాటిల్లో ఉపయోగించిన చిప్‌లు విదేశాలవి.

Updated Date - Jul 01 , 2024 | 05:47 AM