Share News

కేరళ వ్యక్తిలో క్లేడ్‌- బీ రకం మంకీపాక్స్‌ వైరస్‌

ABN , Publish Date - Sep 24 , 2024 | 04:03 AM

కేరళకు చెందిన యువకుడికి సోకిన మంకీపాక్స్‌ వైరస్‌ ప్రపంచ ఆరోగ్య అత్యయిక స్థితికి దారితీసిన క్లేడ్‌-1బీ రకం స్టెయిన్‌గా వైద్యులు నిర్ధారించారు.

కేరళ వ్యక్తిలో క్లేడ్‌- బీ రకం మంకీపాక్స్‌ వైరస్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 23: కేరళకు చెందిన యువకుడికి సోకిన మంకీపాక్స్‌ వైరస్‌ ప్రపంచ ఆరోగ్య అత్యయిక స్థితికి దారితీసిన క్లేడ్‌-1బీ రకం స్టెయిన్‌గా వైద్యులు నిర్ధారించారు. ఈ రకం స్టెయిన్‌కు సంబంధించి భారత్‌లో నమోదైన తొలి కేసు ఇదేనని వారు తెలిపారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. బాధితుడు (38) ఇటీవల యూఏఈ నుంచి తిరిగొచ్చాడు. గతవారం అతడికి వైరస్‌ నిర్ధరణ అయింది. కాగా, సెప్టెంబరు 9వ తేదీన ఢిల్లీలో దేశంలో తొలి మంకీపాక్స్‌ కేసు నమోదైంది. విదేశాల నుంచి తిరిగొచ్చిన ఓ యువకుడి నమూనాలు పరీక్షించగా, అతనికి పశ్చిమ ఆఫ్రికాలో వ్యాప్తిలో ఉన్న క్లేడ్‌- 2 రకం వైరస్‌ సోకినట్లు నిర్ధారితమైంది.

Updated Date - Sep 24 , 2024 | 04:03 AM