PM Modi: ఆ రంగంలో పెట్టుబడులు పెట్టండి.. ప్రధాని మోదీ కీలక సూచనలు
ABN , Publish Date - Apr 24 , 2024 | 01:09 PM
ప్రకృతి వైపరీత్యాలు అనే అతిపెద్ద సవాలును ప్రపంచం నేడు ఎదుర్కుంటోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో బుధవారం జరిగిన డిజాస్టర్ రెసిలెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ICDRI) 6వ అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లో మోదీ మాట్లాడుతూ.. విపత్తులు తట్టుకునే మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు.
ఢిల్లీ: ప్రకృతి వైపరీత్యాలు అనే అతిపెద్ద సవాలును ప్రపంచం నేడు ఎదుర్కుంటోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో బుధవారం జరిగిన డిజాస్టర్ రెసిలెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ICDRI) 6వ అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లో మోదీ(PM Modi) మాట్లాడుతూ.. విపత్తులు తట్టుకునే మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి తప్పించుకోవాలంటే వాటిని తట్టుకునే మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలన్నారు.
"ప్రకృత్తి విపత్తులు.. ఇళ్లు, భవనాలు, మురుగు నీటి వ్యవస్థ, మొబైల్ నెటవర్క్.. ఇలా ఆస్తినష్టం, ప్రాణ నష్టాన్ని కలిగిస్తాయి. నిరాశ్రయులైన ప్రజలు ఆకలితో అలమటిస్తారు. విపత్తులు కుటుంబం నుంచి సమాజం వరకు అందరినీ ప్రభావితం చేస్తాయి. అందుకే విపత్తు నిర్వహణలో పెట్టుబడులు పెట్టడం చాలా ముఖ్యం" అని మోదీ అన్నారు. 2019లో మోదీ ప్రారంభించిన CDRI ప్రస్తుతం 39 దేశాలు, 7 సంస్థలు సహా 46 సభ్య సంస్థలను కలిగి ఉంది.
2024కిగానూ ఐసీడీఆర్ఐ థీమ్ 'మరింత స్థితిస్థాపకమైన రేపటి కోసం ఇవాళ పెట్టుబడి పెట్టడం'. మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా విపత్తు నిర్వహణను సమర్థంగా ఎదుర్కోవడం అనే థీమ్‌పై పని చేస్తోంది.
అంతర్జాతీయ సహకారం..
ఐసీడీఆర్ఐ డైరెక్టర్ జనరల్ అమిత్ ప్రోతి ప్రకృతి వైపరీత్యాల వల్ల పెరుగుతున్న సవాళ్లను వివరించారు. ఆమె మాట్లాడుతూ.. "ప్రకృత్తి విపత్తుల నిర్వహణలో ఐసీడీఆర్‌ఐ పాత్ర చాలా కీలకమైనది. ఇది విపత్తు తట్టుకునే మౌలిక సదుపాయాలపై దృష్టి సారించే అతిపెద్ద సమావేశ, పరిష్కారాల ఆధారిత ప్లాట్‌ఫామ్" అని ప్రోతి అన్నారు.
Zero Shadow Day: ఆకాశంలో నేడు(ఏప్రిల్ 24) ఖగోళ అద్భుతం.. జీరో షాడో డే అంటే
అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడంలో, మౌలిక సదుపాయాల నిపుణులతో సమావేశం నిర్వహించడంలో కీలకంగా వ్యవహరిస్తుందన్నారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే సామర్థ్యం గల మౌలిక సదుపాయాల అభివృద్ధికి.. ప్రభుత్వాలు, నిపుణులు, బ్యాంకులు, ప్రైవేట్ రంగం, మీడియాను ఓ చోట చేర్చి ప్రాధాన్యతలను వివరించడం ఐసీడీఆర్ఐ ముఖ్య ఉద్దేశం.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి