Delhi: పార్లమెంటులో ప్రధాని మోదీ కీలక ప్రసంగం.. ఎంపీలకు సమాచారం పంపిన పీఎంవో
ABN , Publish Date - Feb 04 , 2024 | 10:02 AM
పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో భాగంగా ప్రధాని మోదీ(PM Modi) కీలక ప్రసంగం చేయనున్నారు. సోమవారం జరగనున్న ఈ ప్రసంగంలో మోదీ ముఖ్యమైన అంశాలపై మాట్లాడే అవకాశం ఉంది.
ఢిల్లీ: పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో భాగంగా ప్రధాని మోదీ(PM Modi) కీలక ప్రసంగం చేయనున్నారు. సోమవారం జరగనున్న ఈ ప్రసంగంలో మోదీ ముఖ్యమైన అంశాలపై మాట్లాడే అవకాశం ఉంది. ఇందులో భాగంగా బీజేపీ(BJP) తమ సభ్యులందరినీ సభకు హాజరుకావాల్సిందిగా కోరింది. ప్రధాని తన ప్రసంగంలో.. బీజేపీ హయాంలో జరిగిన అభివృద్ది, సంక్షేమ పథకాలను వివరిస్తారని, రానున్న లోక్ సభ ఎన్నికల్లో(Parliament Elections 2024) భాగంగా పార్టీని సమాయత్తం చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇండియా కూటమి చీలికలవుతున్న తరుణంలో ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించే అవకాశం ఉంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమావేశాల ప్రారంభంలో భాగంగా బుధవారం పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. లోక్‌సభ,రాజ్యసభలో ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగింది. చర్చకు చాలా మంది ఎంపీలు గైర్హాజరయ్యారని, అందుకే సోమవారం పార్లమెంట్‌కు హాజరుకావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు పీఎంవో వర్గాలు తెలిపాయి.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి