Share News

PM Modi: జమ్మూలో నేడు, రేపు మోదీ పర్యటన.. యోగా దినోత్సవంలో పాల్గొననున్న ప్రధాని

ABN , Publish Date - Jun 20 , 2024 | 07:38 AM

ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 20, 21 తేదీల్లో జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన అంతర్జాతీయ యోగా కార్యక్రమంలో పాల్గొంటారు. జూన్ 20న సాయంత్రం 6 గంటలకు శ్రీనగర్‌లోని షేర్-ఐ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ (SKICC)లో 'ఎంపవరింగ్ యూత్, ట్రాన్స్‌ఫార్మింగ్ J&K' కార్యక్రమంలో భాగస్వామి అవుతారు.

PM Modi: జమ్మూలో నేడు, రేపు మోదీ పర్యటన.. యోగా దినోత్సవంలో పాల్గొననున్న ప్రధాని

శ్రీనగర్‌: ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 20, 21 తేదీల్లో జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన అంతర్జాతీయ యోగా కార్యక్రమంలో పాల్గొంటారు. జూన్ 20న సాయంత్రం 6 గంటలకు శ్రీనగర్‌లోని షేర్-ఐ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ (SKICC)లో 'ఎంపవరింగ్ యూత్, ట్రాన్స్‌ఫార్మింగ్ J&K' కార్యక్రమంలో భాగస్వామి అవుతారు.కశ్మీర్‌లో బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు.

వ్యవసాయం, అనుబంధ రంగాల ప్రాజెక్ట్ (JKCIP)లో పోటీతత్వాన్ని పెంచేందుకు వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. జూన్ 21న ఉదయం 6:30 గంటలకు శ్రీనగర్‌లోని SKICCలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని, సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ ఏడాది యోగా డే థీమ్ 'యువత మనసు, శరీరంపై యోగా ప్రభావం'.


2015 నుండి ఢిల్లీలోని కర్తవ్య పథ్, చండీగఢ్, డెహ్రాడూన్, రాంచీ, లక్నో, మైసూరు, న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంతో సహా వివిధ ప్రాంతాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం (IDY) వేడుకలకు మోదీ నాయకత్వం వహించారు. 21వ తేదీన దాదాపు 7 వేల మందితో కలిసి ప్రధాని మోదీ యోగా చేయనున్నారు. అనంతరం శ్రీనగర్‌లో.. ఎంపవరింగ్ యూత్ అండ్ ట్రాన్స్‌ఫార్మింగ్ జమ్ము కాశ్మీర్ కార్యక్రమంలో ఆయన పాల్గొని యువతతో ముచ్చటిస్తారు.

రూ. 15 వందల కోట్ల విలువైన 84 ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరనున్న 2 వేల మందికి నియామక ప్రతాలు అందజేయనున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో జమ్ము కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా భద్రత చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రధానిగా మూడోసారి బాధ్యతలు స్వీకరించిన తరువాత మోదీ తొలిసారిగా కశ్మీర్‌లో పర్యటిస్తున్నారు.

Updated Date - Jun 20 , 2024 | 07:38 AM