Election Commission: అరుణాచల్‌ప్రదేశ్‌లో 8 కేంద్రాల్లో రీ పోలింగ్
ABN , Publish Date - Apr 22 , 2024 | 04:05 PM
అరుణాచల్‌ప్రదేశ్‌లోని 8 కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఆదేశించింది. ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 6 గంటల నుంచి మద్యాహ్నం 2.00 గంటల మధ్య ఈ రీపోలింగ్ నిర్వహించాలని స్పష్టం చేసింది.
ఈటానగర్, ఏప్రిల్ 22: అరుణాచల్‌ప్రదేశ్‌లోని 8 కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఆదేశించింది. ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 6 గంటల నుంచి మద్యాహ్నం 2.00 గంటల మధ్య ఈ రీపోలింగ్ నిర్వహించాలని స్పష్టం చేసింది.
West Bengal: ఉపాధ్యాయులు భర్తీ స్కాం.. మమత ప్రభుత్వానికి గట్టి దెబ్బ
తూర్పు కమెంగ్ జిల్లాలోని బమెంగ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని సరియో, కురుంగ్ కుమేలో న్యాపిన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని లంగేతే లత్, దింగ్సర్, బొగియా సియుమ్, జింబారితోపాటు అప్పర్ సుబాన్సిరి జిల్లాలోని నాకో అసెంబ్లీ నియోజకవర్గంలోని లెంగి కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని తెలిపింది.
25000 Teachers Fired: 25 వేల మంది ప్రభుత్వ టీచర్ల తొలగింపు.. వడ్డీతో సహా శాలరీ చెల్లించాలని ఆదేశాలు
అయితే ఏప్రిల్ 19వ తేదీ లోక్‌సభ ఎన్నికలతో పాటు అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీకి సైతం ఎన్నికలు జరిగాయి. ఆ క్రమంలో హింస చెలరేగింది. దీంతో ఈవిఎంలు సైతం దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఉన్నతాధికారులు నివేదిక అందించారు. దాంతో ఎనిమిది కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని స్పష్టమైన ఆదేశాలను ఈసీ జారీ చేసింది.
లోక్‌సభ ఎన్నికలు మొత్తం 7 దశల్లో జరుగుతున్నాయి. అలాగే ఆ యా దశలతోపాాటే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సైతం జరుగుతున్నాయి. తొలి దశలో 102 లోక్‌సభ స్థానాలతోపాటు అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు ఎన్నికల జరిగాయి.
ఉద్యోగాల కోసం 54.25 లక్షల మంది నిరీక్షణ
ఇక అరుణాచల్‌ప్రదేశ్‌లోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద హింస చెలరేగింది. దీంతో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ జరపాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. మరోవైపు అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 60 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో 10 మంది ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Read Latest National News and Telugu News