Share News

Farooq Abdullah: సమయం ఇదే.. కశ్మీర్ పండిట్లు వెనక్కి రావాలి

ABN , Publish Date - Oct 12 , 2024 | 08:44 PM

కశ్మీర్ పండిట్లకు నేషనల్ కాన్ఫరెన్స్ శత్రువు కాదని, ప్రభుత్వం అందర్నీ కలుపుకొని ముందుకు వెళ్తుందని ఎస్‌సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా అన్నారు.

Farooq Abdullah: సమయం ఇదే.. కశ్మీర్ పండిట్లు వెనక్కి రావాలి

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటు సిద్ధమవుతున్న నేషనల్ కాన్ఫరెన్స్ (NC) పార్టీ ఐక్యతా సందేశం ఇచ్చింది. లోయలో ఉగ్రవాదంతో ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టిన కశ్మీర్ పండిట్లు తిరిగి సొంత గూటికి చేరుకునేందుకు ఇదే తగిన తరుణమని ఎన్‌సీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా అన్నారు. పండిట్లకు ఎన్‌సీ శత్రువు కాదని, ప్రభుత్వం అందర్నీ కలుపుకొని ముందుకు వెళ్తుందని చెప్పారు.

Dussehra: రావణదహనానికి విల్లుపట్టిన ముర్ము, మోదీ


''ఇక్కడి నుంచి వెళ్లిపోయిన తమ్ముళ్లు, చెల్లెళ్లు అందరూ తిరిగి ఇంటికి వస్తారని ఆశిస్తున్నాను. అందుకు ఇప్పుడు సమయం వచ్చింది. వాళ్లు సొంతగూటికి తిరిగిరావాలి. మేము కేవంల కశ్మీర్ పండిట్ల గురించే ఆలోచించడం లేదు, జమ్మూ ప్రజలందరి గురించి ఆలోచిస్తున్నాం. వారిని మేము బాగు చూసుకోవాల్సి ఉంటుంది. వాళ్లు కూడా నేషనల్ ఫ్రంట్ తమ శత్రువు కాదని విశ్వసించాలి. మనమంతా భారతీయులం, అందర్నీ కలుపుకొని ముందుకు వెళ్లాలని మేము కోరుకుంటున్నాం'' అని ఫరూక్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.


కశ్మీర్ పండిట్లు 90వ దశకంలో ఉగ్రవాదం ఉధృతంగా ఉన్న దశలో కశ్మీర్ లోయను విడిచిపెట్టి పారిపోయారు. ఇళ్లు, ఆస్తులు విడిచిపెట్టి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. కాగా, జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని ఫరూక్ మరోసారి డిమాండ్ చేశారు. రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తేనే రాష్ట్రం తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించగలుగుతుందని అన్నారు. ఇక్కడ అతిపెద్ద సమస్య నిరుద్యోగమని, జమ్మూ, కశ్మీర్‌ను కలిపి ఉంచడానికే తాము ప్రాధాన్యతనిస్తామని చెప్పారు.


Read More National News and Latest Telugu News

ఇది కూడా చదవండి..

Haryana: హర్యానాలో కొత్త బీజేపీ ప్రభుత్వం ప్రమాణస్వీకార తేదీలో ట్విస్ట్

Updated Date - Oct 12 , 2024 | 08:44 PM