Share News

High Court: కలకత్తా హైకోర్టు తీర్పు ఏకపక్షం

ABN , Publish Date - Apr 25 , 2024 | 04:17 AM

పశ్చిమబెంగాల్‌లో జరిగిన ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం కేసులో కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏకపక్షంగా ఉందని తన పిటిషన్‌లో పేర్కొంది.

High Court: కలకత్తా హైకోర్టు తీర్పు ఏకపక్షం

  • ఉపాధ్యాయ నియామకాల కేసులోసు ప్రీంకోర్టుకు పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం

కోల్‌కతా, ఏప్రిల్‌ 24: పశ్చిమబెంగాల్‌లో జరిగిన ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం కేసులో కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏకపక్షంగా ఉందని తన పిటిషన్‌లో పేర్కొంది.

పశ్చిమ బెంగాల్‌లోని మమత సర్కారు రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్‌ఎల్‌ఎ్‌సటీ) ద్వారా 2016లో జరిపిన బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సోమవారం సంచలన తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో 25,753 మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు.


అంతేకాక, నియామక ప్రక్రియ చెల్లదని, అక్రమంగా ఉద్యోగాలు పొందినవారంతా గత ఎనిమిదేళ్లుగా తాము తీసుకున్న జీతాలను వడ్డీతో సహా నాలుగు వారాల్లోగా తిరిగి చెల్లించాలని తీర్పులో పేర్కొంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వానికి తగినంత సమయం ఇవ్వకుండా ఉన్నపళంగా ఉద్యోగులను తొలగించమంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల విద్యా వ్యవస్థ స్తంభించిపోయిందని బెంగాల్‌ సర్కారు సుప్రీం కోర్టుకు విన్నవించింది.

Updated Date - Apr 25 , 2024 | 04:18 AM