Share News

Uttar Pradesh: కఠిన 'లవ్ జిహాద్' బిల్లుకు యోగి సర్కార్ ఆమోదం.. దోషులకు ఇక యావజ్జీవం

ABN , Publish Date - Jul 30 , 2024 | 06:19 PM

బలవంతపు మతమార్పిడుల నిరోధక (సవరణ) బిల్లు-2024కు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ మంగళవారంనాడు ఆమోదం తెలిపింది. సోమవారంనాడు ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టగా ఈరోజు సభ ఆమోదించింది.

Uttar Pradesh: కఠిన 'లవ్ జిహాద్' బిల్లుకు యోగి సర్కార్ ఆమోదం.. దోషులకు ఇక యావజ్జీవం

లక్నో: బలవంతపు మతమార్పిడుల నిరోధక (సవరణ) బిల్లు-2024 (Anti-love jihad)కు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ (Uttar Pradesh Assembly) మంగళవారంనాడు ఆమోదం తెలిపింది. సోమవారంనాడు ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టగా ఈరోజు సభ ఆమోదించింది. సవరించిన బిల్లు ప్రకారం మోసపూరిత వివాహాలు, ఇతర మార్గాల ద్వారా మతిమార్పిడికి పాల్పడే వారికి శిక్ష శిక్ష మరింత పెరగనుంది. ఇలాంటి వారికి గరిష్టంగా యావజ్జీవ జైలుశిక్ష పడుతుంది.

Wayanad landslides: వయనాడ్‌ను ఆదుకోండి... కేంద్రాన్ని కోరిన రాహుల్ గాంధీ


సవరించిన నిబంధనలు ఇవే..

సవరించిన నిబంధనల ప్రకారం మతమార్పిడి ఉద్దేశంతో మైనర్లను, ఇతరులను బెదిరించడం, దాడులు చేయడం, వివాహం చేసుకోవడం, వివాహం చేసుకుంటామని వాగ్దానం చేయడం వంటి చర్యలకు ఎవరు పాల్పడినా అది తీవ్ర నేరంగా పరిగణిస్తారు. అలాంటి కేసుల్లో 20 ఏళ్లు జైలు కానీ యావజ్జీవ కారాగార శిక్ష కానీ విధిస్తారు. గతంలో ఇలాంటి నేరాలకు పాల్పడన వారికి పదేళ్ల జైలు, రూ.50,00 జరిమానా ఉండేది. సవరించిన నిబంధనల ప్రకారం ఎవరైనా సరే కన్వర్షన్ కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు. గతంలో ఇలాంటి కేసుల్లో సమాచారం కానీ, ఫిర్యాదు కానీ బాధితులు, తల్లిదండ్రులు, తోబుట్టువుల సమక్షంలోనే ఇవ్వాల్సి ఉండేది. ఇప్పుడు ఎవరైనా సరే లిఖితపూర్వకంగా పోలీసులకు సమాచారం ఇస్తే సరిపోతుంది. ఇలాంటి కేసుల విచారణను సెషన్స్ కోర్టు కంటే దిగువ కోర్టులు చేపట్టరాదు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేకుండా బెయిల్ అభ్యర్థలను పరిశీలించరాదు. ఇవన్నీ నాన్-బెయిలబుల్ కేసులుగా పరిగణిస్తారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Jul 30 , 2024 | 06:24 PM