Share News

బెంగాల్‌ తగలబడితే అసోం కాలిపోద్ది: మమత

ABN , Publish Date - Aug 29 , 2024 | 06:18 AM

పశ్చిమ బెంగాల్‌లో జూనియర్‌ వైద్యురాలి హత్యాచార ఘటనను నిరసిస్తూ బీజేపీ పిలుపునిచ్చిన బంద్‌ హింసాత్మకంగా మారిన నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం మమత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం తృణమూల్‌ కాంగ్రెస్‌ ఛాత్ర పరిషత్‌

బెంగాల్‌ తగలబడితే అసోం కాలిపోద్ది: మమత

కోల్‌కతా, ఆగస్టు 28: పశ్చిమ బెంగాల్‌లో జూనియర్‌ వైద్యురాలి హత్యాచార ఘటనను నిరసిస్తూ బీజేపీ పిలుపునిచ్చిన బంద్‌ హింసాత్మకంగా మారిన నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం మమత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం తృణమూల్‌ కాంగ్రెస్‌ ఛాత్ర పరిషత్‌ (విద్యార్థి విభాగం) ఆవిర్భావ దినోత్సవంలో ఆమె మాట్లాడుతూ, ప్రధాని మోదీ తమ రాష్ట్రంలో అలజడులు సృష్టించి లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని, బెంగాల్‌ తగలబడితే దేశ రాజధాని ఢిల్లీతో పాటు, అసోం, ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, ఒడిసా కూడా కాలిపోతాయని హెచ్చరించారు. మమత వ్యాఖ్యలపై అసోం సీఎం హిమంత ఘాటుగా స్పందించారు. ‘‘అసోంను బెదిరించడానికి మీకు ఎంత ధైర్యం’’ అని ఆమెపై మండిపడ్డారు.

Updated Date - Aug 29 , 2024 | 06:18 AM