Share News

Mamata Banerjee: భారత ఆర్థిక వృద్ధిపై మమత సంచలన వ్యాఖ్యలు.. అమమానకరమంటూ మండిపడిన బీజేపీ

ABN , Publish Date - Mar 28 , 2025 | 04:59 PM

మమతతో జరిగిన చర్చలో మోడరేటర్ మాట్లాడుతూ, ఇండియా ఇప్పటికే యూకేను అధిగమించి ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందనీ, 2060 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తొలి స్థానానికి చేరుకుంటుందనే అంచనాలు ఉన్నాయని అన్నారు. ఇందుకు మమత స్పందిస్తూ ''దీనితో నేను విభేదిస్తు్న్నాను'' అని అన్నారు.

Mamata Banerjee: భారత ఆర్థిక వృద్ధిపై మమత సంచలన వ్యాఖ్యలు.. అమమానకరమంటూ మండిపడిన బీజేపీ
Mamata Benerjee

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వీటిపీ బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. విదేశీగడ్డపై భారత్‌ను అమానించారంటూ మండిపడింది. ప్రస్తుతం యూకేలో ఉన్న మమతా బెనర్జీ ఆక్స్‌ఫోర్డ్ యూనివర్శిటీలోని కేలాగ్ కాలేజీలో 'సోషల్ డవలప్‌మెంట్- గర్ల్, చైల్డ్ అండ్ ఉమన్ ఎంపవర్‌మెంట్' అనే అశంపై మాట్లాడారు. 2060 నాటికి ప్రపంచంలోనే నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా రూపొందుతుందనే అభిప్రాయంతో ఆమె విభేదించారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్‌ మాలవియ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్ట్ చేసారు.

PM Modi: థాయ్‌లాండ్, శ్రీలంకలో మోదీ పర్యటన ఖరారు


మమతతో జరిగిన చర్చలో మోడరేటర్ మాట్లాడుతూ, ఇండియా ఇప్పటికే యూకేను అధిగమించి ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందనీ, 2060 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తొలి స్థానానికి చేరుకుంటుందనే అంచనాలు ఉన్నాయని అన్నారు. ఇందుకు మమత స్పందిస్తూ ''దీనితో నేను విభేదిస్తు్న్నాను'' అని అన్నారు. మాట్లాడటానికి చాలా విషయాలు ఉన్నప్పటికీ ఇక్కడ తాను మాట్లాడటం లేదని, అంతర్గత, విదేశాంగ అంశాలను తాను వెల్లడించలేనని అన్నారు. అయితే తనకు కొన్ని అభిప్రాయాలు కూడా ఉన్నాయని చెప్పారు. కోవిడ్ తర్వాత ప్రపంచంలోని చాలాదేశాలు అల్లకల్లోక పరిస్థితులను ఎదుర్కొన్నాయని, ప్రపంచం ఆర్థిక-యుద్ధం తరహా పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు మనం లబ్ధి పొందుతామని ఎలా అంచనా వేయగలం? ఆశాహహంగా మాత్రమే ఉండగలుగుతాం అని అన్నారు. ''అందరికంటే ఉత్తమంగా ఉండాలనేది మా డ్రీమ్. ఇట్ డిపెండ్స్..'' అంటూ వ్యాఖ్యానించారు.


సిగ్గుచేటు..

భారత ఆర్థిక వ్యవస్థ, అంచనాలపై మమతాబెనర్జీ వ్యాఖ్యలను అమిత్ మాలవీయ తప్పుపట్టారు. దేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనుకోవడమే ఆమెకు సమస్యగా కనిపిస్తున్నట్టుందని అన్నారు. ఇది చాలా సిగ్గుచేటు వ్యవహారమని, రాజ్యంగ పదవిలో ఉన్న వ్యక్తి హోదాకు తగ్గట్టుగా లేదని, విదేశీగడ్డపై ఇలాంటి మాటలు మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ, దేశం సాధించిన విజయాలను ఇండియా కూటమి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. రాహుల్ గాంధీ తరహాలోనే భారత్ విజయలను విదేశీగడ్డపై కించపరచేలా 'భారత్ బద్నామీ బ్రిగేట్' మాట్లాడుతోందని అన్నారు. ఇండియాలోని ఒక రాష్ట్రానికి సీఎంగా ఉన్న మమతాబెనర్జీ ఇండియా వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని బీజేపీ బెంగాల్ చీఫ్ సుకాంత మజందూర్ ఆక్షేపణ తెలిపారు. ముఖ్యమంత్రిగానే కాదు, ఇండియన్ అని చెప్పుకోవడానికి కూడా మమత ఇష్టపడటం లేదన్నారు.


ఇవి కూడా చదవండి..

Supreme Court: అంతర్గత విచారణ తర్వాతే ఎఫ్ఐఆర్.. జస్టిస్ వర్మపై పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం

Bengaluru: మా చేతులు కట్టేశారు..

Maoist Letter: ఆపరేషన్ కగార్... మావోల సంచలన లేఖ

For National News And Telugu News

Updated Date - Mar 28 , 2025 | 05:51 PM