Share News

తెలివైన కళాకారుడు

ABN , Publish Date - Jul 11 , 2024 | 12:02 AM

జయపురాన్ని పాలించే రాజు గోవింద వర్మకు కళలు అంటే ఎంతో ప్రీతి. తన రాజ్యంలో ఉత్తమ ప్రతిభ కనబరచిన కళాకారులకు విలువైన బహుమతులు ఇచ్చి సన్మానిస్తూ

తెలివైన కళాకారుడు

జయపురాన్ని పాలించే రాజు గోవింద వర్మకు కళలు అంటే ఎంతో ప్రీతి. తన రాజ్యంలో ఉత్తమ ప్రతిభ కనబరచిన కళాకారులకు విలువైన బహుమతులు ఇచ్చి సన్మానిస్తూ ఉండేవాడు. ఒక రోజు గోవింద వర్మ తన కొలువులో ఒక సవాలు విసిరాడు. కుంచె మరియు రంగులు లేకుండా బొమ్మగీయగల చిత్రకారుడికి ఘనమైన సన్మానంతో పాటు వెయ్యి బంగారు నాణాలు బహుమతిగా ప్రకటించాడు. కానీ అతని ఆస్థానంలో చిత్రకారులంతా ‘కుంచె, రంగులు లేకుండా చిత్రం ఎవరైనా ఎలా గీయగలరు?’ అనుకుని మౌనంగా ఉండిపోయారు. ఒక మారుమూల గ్రామంలో నివసించే కోటయ్య అనే పేద కళాకారుడికి మాత్రం ఎలాగైనా ఈ సవాలుకు జవాబు చెప్పి రాజు గారి మెప్పు పొందాలి అనిపించేది.


అతను ఇలా ఆలోచిస్తూ ఉండగా అతని ఇంట్లో ఉన్న దీపం గూట్లో పైన ఉన్న తెల్లని గోడకు నల్లగా మసి పట్టడంగమనించాడు. ఆ మర్నాడ అతను కుంచె, రంగులు లేకుండానే బొమ్మ గీయగలనని రాజు గారి దర్శనానికి అనుమతి కోరాడు. అనుమతి లభించి రాజుగారి ఎదుటికి వెళ్లి, తన చేతి సంచీలోనుంచి ఒక దీపం మరియు తెల్ల కాగితం తీసి ఆ కాగితం నిండా దీపపు మసి పట్టేటట్లు చేసి, తర్వాత ఆ కాగితం మీద నేర్పుగా తన వేళ్లతో రాజుగారి చిత్రం గీశాడు. అతని సమయస్ఫూర్తికి రాజుగారు మెచ్చి, ఇచ్చిన మాట ప్రకారం ఘనమైన సన్మానంతో పాటు వెయ్యి బంగారు నాణాలు కానుకగా ఇచ్చి పంపాడు.

Updated Date - Jul 11 , 2024 | 12:02 AM