Share News

భలే ‘బగ్రూ’

ABN , Publish Date - Jan 03 , 2024 | 03:48 AM

300 ఏళ్ల నాటి బగ్రూ చేతి అద్దకం టెక్నిక్‌ మూలాలు, రాజస్థాన్‌, జైపూర్‌కు చెందిన ‘బగ్రూ’ అనే ఒక మారుమూల కుగ్రామంలో ఉన్నాయి.

భలే ‘బగ్రూ’

ఒంటికి మెత్తగా తగులుతూ, తేలికగా, సౌకర్యంగా ఉండే కాటన్‌ చీరలను ఇష్టపడని మహిళలంటూ ఉండరు. మరీ ముఖ్యంగా జైపూర్‌ బగ్రూ కాటన్‌ చీరలు ఇటీవలి కాలంలో మహిళల మనసులను దోచుకుంటున్నాయి. ఆకర్షణీయమైన రంగులు, అద్దకాలతో అలరిస్తున్న బగ్రూ హ్యాండ్‌ ప్రింట్‌ కాటన్‌ చీరలు ఇవే!

ఘన చరిత్ర

300 ఏళ్ల నాటి బగ్రూ చేతి అద్దకం టెక్నిక్‌ మూలాలు, రాజస్థాన్‌, జైపూర్‌కు చెందిన ‘బగ్రూ’ అనే ఒక మారుమూల కుగ్రామంలో ఉన్నాయి. సంజారియా నది చుట్టుముట్టి ఉండే, బగోరా దీవి నుంచే ‘బగ్రూ’ అనే పేరు పుట్టుకొచ్చింది. ఆఫ్‌ వైట్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మీద ముదురు రంగు మోటిఫ్స్‌ ముద్రించి ఉండడం ఈ చీరల ప్రత్యేకత. రాజస్థాన్‌లోని ‘చిప్ప’, ‘ఖరాడి’ అనే కమ్యూనిటీకి చెందిన వాళ్లు ఈ సంప్రదాయ అద్దకాన్ని వందల ఏళ్ల నుంచీ కొనసాగిస్తూ ఉండడం విశేషం.

పరిమిత డిజైన్లలో...

వైవిద్యమైన పూల మోటిఫ్స్‌ను కలిగి ఉండే బగ్రూ చీరలు ఎక్కువగా ఇండిగో, నారింజ, పసుపు రంగుల్లో తయారవుతూ ఉంటాయి. మోటిఫ్స్‌తో పాటు బుటా, ఝర్‌ లేదా బార్డర్‌లను కలిగి ఉండడం ఈ చీరల ప్రత్యేకత. ఈ చీరలన్నీ పాత కళాకృతులు, పొద్దుతిరుగుడు, గులాబీ, ఇతర స్థానిక పువ్వుల డిజైన్లనే కలిగి ఉంటాయి.

ఇలా శింగారించాలి

బగ్రూ కాటన్‌ చీరలను డైలీ వేర్‌గా, ఆఫీస్‌ వేర్‌గా వాడుకోవచ్చు. ఫ్యాషన్‌ ఐకాన్‌గా కనిపించాలనుకుంటే, మెటల్‌ జ్యువెలరీ ధరించాలి. చీరకు మ్యాచింగ్‌ బ్లౌజ్‌ స్టైలిష్‌గా ఉండేలా చూసుకోవాలి. కొల్హాపురి చెప్పులు ఈ చీరలకు చక్కగా సూటవుతాయి. వీలైనంత వరకూ సింపుల్‌ జ్యువెలరీనే ఎంచుకోవాలి.

Updated Date - Jan 03 , 2024 | 03:48 AM