Health Tips : స్ట్రెస్‌లాక్సింగ్ అంటే ఏమిటి? విశ్రాంతి తీసుకోవాలన్నా ఒత్తిడికి గురవుతున్నామా..!
ABN , Publish Date - Aug 07 , 2024 | 01:18 PM
విశ్రాంతి తీసుకునే సమయం, అవకాశం కలగకపోవడం కూడా మన మీద ఒత్తిడికి కారణం అనుతుందట. స్ట్రెస్ లాక్సింగ్ అంటే విశ్రాంతి తీసుకోవాలని ప్రయత్నించడంలో కూడా ఒత్తిడికి గురికావడం.
నిద్ర లేచింది మొదలు అందరివీ హడావిడి జీవితాలే చాలావరకూ. మనకంటూ సమయాన్ని కేటాయించేదీ తక్కువే. ఒత్తిడి మనిషిని నిలబడనీయకుండా చేస్తుంది. విశ్రాంతి లేకపోవడం విపరీతమైన మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది. దీనికి కారణాలు ఏమిటనేది తెలుసుకుందాం.
ఇల్లు, ఆఫీసు ఇలా ప్రతి విషయంలోనూ ఒత్తిడి సమయాల్లో విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటూనే ఉంటాం. విశ్రాంతి తీసుకునే సమయం, అవకాశం కలగకపోవడం కూడా మన మీద ఒత్తిడికి కారణం అనుతుందట. స్ట్రెస్ లాక్సింగ్ అంటే విశ్రాంతి తీసుకోవాలని ప్రయత్నించడంలో కూడా ఒత్తిడికి గురికావడం. ఈ సమస్యను అధిగమించాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సిందే.
పని ఒత్తిడి.. చేసే పనిలో తృప్తి లేకపోవడం, చేయాలనుకున్న పని చేయలేకపోవడం ఇవి మనిషిని అపరాధ భావన వైపు నెట్టేస్తాయి. ఏదో సాధించలేకపోయామనే ఆలోచన కూడా ఒత్తిడికి గురిచేస్తుంది.
Health Tips : తల్లిపాలతో బిడ్డకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటి..!
పోటీతత్వం.. ఎదుటివారిని దాటి పనిచేయాలనుకోవడం, వారికన్నా మెరుగ్గా పనిచేయడం ఇవి ఉత్సాహాన్ని ఇస్తాయి. అదే ఎదుటివారిని మించి పనిచేయలేనప్పుడు, అవకాశాలను కోల్పోవడం మరింత ఆందోళనను కలిగిస్తుంది.
అంచనాలు తారుమారు.. విశ్రాంతి తీసుకోవాలి అనుకుని సమయాన్ని కేటాయించాకా అది కుదరక, ప్రణాళికలు తారుమారు అయినప్పుడు కూడా నిరాశ చెందుతాం.
ఎక్కువగా ఆలోచించడం.. అతిగా ఆలోచించడం కూడా ఒత్తిడికి కారణం కావచ్చు.
Women Health : గర్భం దాల్చిన తర్వాత చర్మ సమస్యలు ఎందుకు వస్తాయ్.. !
అసలు ఒత్తిని ఎలా ఎదుర్కోవాలి.
మైండ్ ఫుల్ నెస్..
ధ్యానం, వ్యాయామాల ద్వారా ఆలోచన ప్రశాంతంగా ఉంటుంది. విశ్రాంతి తీసుకోవాలనే విషయంలో ఆందోళ కూడా తగ్గుతుంది.
రిలాక్స్ కావడానికి..
విశ్రాంతి అనేది కాస్త ప్రశాంతంగా ఇష్టమైన పని చేయడంలోనూ దొరుకుతుంది. నచ్చిన పుస్తకం చదవడం,ఎక్కువ శ్రమ పడిన తర్వాత స్నానం చేయడం, ఇవి ఒత్తిడిని మరిచిపోయేలా చేస్తాయి.
Healthy Foods : నానబెట్టిన బాదం, వేరుశెనగలో ఏది ఆరోగ్యానికి మంచిది ?
సోషల్ మీడియా నుంచి..
సోషల్ మీడియా చూసేందుకు కాస్త సమయాన్ని అలవాటు చేసుకోవాలి.
మనసు ప్రశాంతంగా ఉండటానికి తగిన వాతావరణాన్ని సృష్టించుకోవాల్సింది మనమే. ఒత్తిడి నుంచి తప్పుకోవడానికి విశ్రాంతి మాత్రమే మార్గం కాదు. ముందుగా మెదడు కూడా ప్రశాంతంగా ఉండాలి. అతిగా ఆలోచించడాన్ని తగ్గించుకుని, పరిస్థితిని అర్థం చేసుకోవడం, దానికి తగినట్టుగా సమయాన్ని పంచడం ఎంత ఒత్తిడినైనా తట్టుకునేలా చేస్తుంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.