Health Tips : కాల్చిన అల్లం, తేనెతో జలుబు, గొంతు నొప్పికి చెక్ పెట్టండిలా... !
ABN , Publish Date - Jul 29 , 2024 | 02:15 PM
కాల్చిన అల్లం కీళ్లు, ఎముకల నొప్పుల నుంచి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది. ఇందులోని ఇన్ఫ్లమేటరీ గుణాలు వాపును తగ్గిస్తాయి.
వానలు పడుతున్నాయంటే రకరకాల వ్యాధులు చిన్నా,పెద్దా అందర్నీ ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. ముఖ్యంగా వానాకాలంలో జలుబు, దగ్గు అందరిలోనూ కనిపించే కామన్ ప్రాబ్లమ్. దీని నుంచి ఉపశమనం కోసం రకరకాల టానిక్స్, ట్యాబ్లెట్లను మింగేస్తూ ఉంటారు. ఇలాంటి ఇబ్బందిని చిన్న చిట్కాతో తగ్గించుకోవచ్చు. మనం అందరం ఎక్కువగా వాడే ఇంటి పదార్థం అల్లం. అల్లం భారతీయ వంటగదిలో ముఖ్యమైన పదార్థం. కూరలలో, మసాలా దినుసుగా, ఆరోగ్యాన్ని కాపాడే ఔషధంగా కూడా ఉపయోగిస్తూ ఉంటాం. అన్ని విధాలుగా మానవ ఆరోగ్యానికి అల్లం చక్కని ఎంపిక. అల్లాన్ని దంచి వాడటం వేరు. పచ్చి అల్లాన్ని కాల్చి, తేనెతో కలిపి తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుందట. దీనితో దగ్గు, జలుబుతోపాటు, శ్లేష్మం ఇబ్బంది, గొంతు నొప్పి కూడా క్షణాల్లో తగ్గుతాయి.
వర్షాకాలంలో అంటువ్యాధుల నుంచి రక్షణ కోసం అనేక జాగ్రత్తలు పాటిస్తాం. శరీరానికి సరిపడే ఆహారాన్ని మాత్రమే తీసుకుంటాం. వానాకాలం చల్లదనానికి దగ్గు, జలుబు, ఫ్లూ వంటివి సాధారణంగా అందరిలోనూ కనిపించే లక్షణాలే. అయితే ఈ వ్యాధుల నుంచి రక్షణకు అల్లం చక్కని పరిష్కారంగా పనిచేస్తుంది. కాల్చిన అల్లంతో తేనె కలిపి తీసుకుంటే వాతావరణంలో తేమ కారణంగా వచ్చే జలుబు, దగ్గు, గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
కాల్చిన అల్లం, తేనె వానాకాలం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, వాతావరణంలో మార్పుల కారణంగా వచ్చే వ్యాధుల నుంచి రక్షణను ఇస్తాయి. ఇవి దగ్గు, జలుబు, ఫ్లూ వంటి వ్యాధులకు దివ్య ఔషధంగా పనిచేస్తాయి. అల్లం, తేనెలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటాయి.
Women With Diabetes : మధుమేహం ఉన్న స్త్రీలలో అధికంగా కనిపించే సంకేతాలు ఇవే..
కాల్చిన అల్లం, తేనె తినడం వల్ల..
దగ్గు, కఫం నుంచి బయటపడాలంటే అల్లం, తేనె కలిపి తీసుకుంటే శ్లేష్మం తగ్గుతుంది. జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది.
కాల్చిన అల్లం కీళ్లు, ఎముకల నొప్పుల నుంచి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది. ఇందులోని ఇన్ఫ్లమేటరీ గుణాలు వాపును తగ్గిస్తాయి.
Health Tips : ఎయిర్ పాడ్స్ వాడితే బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా..!
మధుమేహం ఉన్నవారికి కాల్చిన అల్లం రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. షుగర్ ఉన్నవారు ప్రతిరోజూ అల్లాన్ని ఆహారంలో తీసుకుంటే చక్కని ఫలితం ఉంటుంది.
మైగ్రేన్ నొప్పితో బాధపడుతున్నవారు అల్లం తినడం వల్ల విపరీతమైన తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
అల్లాన్ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుంది. ఇందులో ఉంటే ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గొంతు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. శరీరానికి అవసరమైన వేడిని అల్లం అందిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.