Share News

Clear Skin Secrets Before Bath Time: స్నానానికి వెళ్లే ముందు

ABN , Publish Date - Mar 27 , 2025 | 02:57 AM

ముఖంపై మొటిమలు, మచ్చలు తొలగించడానికి స్నానానికి ముందు కొన్ని చిట్కాలు పాటిస్తే వేగంగా ఫలితాలు పొందవచ్చు. కలబంద గుజ్జు, పెరుగు, పసుపు, నిమ్మరసం, తేనె, శనగపిండి వంటి సహజ పదార్థాలతో చర్మంపై మచ్చలను పోగొట్టవచ్చు. ఈ చిట్కాలు చర్మం పొరలను శుభ్రం చేసి, కొత్త కణాలను పెంచుతాయి.

Clear Skin Secrets Before Bath Time: స్నానానికి వెళ్లే ముందు

వాతావరణ కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల అసమతౌల్యం లాంటి పలు కారణాల వల్ల ముఖంపై మొటిమలు, వీటి నుంచి మచ్చలు ఏర్పడుతుంటాయి. స్నానానికి వెళ్లేముందు కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ మచ్చలను త్వరగా పోగొట్టుకోవచ్చు.

  • రెండు చెంచాల కలబంద గుజ్జును తీసుకుని మంచి నీళ్లలో ముంచి కడగాలి. తరవాత దీన్ని ముఖమంతా పట్టించాలి. పావుగంటసేపు ఆరిన తరవాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. కలబంద గుజ్జులోని తేమ, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు చర్మం పొరలను శుభ్రం చేస్తాయి. ఆరోగ్యవంతమైన నూతన చర్మ కణాలు పెరిగేందుకు తోడ్పడతాయి.

  • ఒక గిన్నెలో రెండు చెంచాల పెరుగు, అర చెంచా పసుపు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖమంతా పలుచగా పట్టించాలి. పది నిమిషాలు ఆరాక వేళ్లతో సున్నితంగా మర్దన చేస్తే చర్మం మీద ఉన్న మృతకణాలు తొలగిపోతాయి. పెరుగులోని లాక్టిక్‌ ఆమ్లం, పసుపులోని కర్కుమిన్‌ మూలకం కలిసి మచ్చలను పోగొడతాయి.

  • ఒక గిన్నెలో ఒక చెంచా నిమ్మరసం తీసుకోవాలి. ఇందులో చూపుడు వేలుని ముంచి దానితో ముఖం మీద ఉన్న మచ్చలపై పూతలా రాయాలి. అయిదు నిమిషాల తరవాత నీళ్లతో కడిగేసుకోవాలి. నిమ్మరసంలోని సిట్రిక్‌ ఆమ్లం, బ్లీచింగ్‌ ఏజెంట్‌లా పనిచేసి మచ్చలను పోగొడుతుంది. చర్మాన్ని మెరిపిస్తుంది.


  • ఒక చెంచా తేనెలో చిటికెడు దాల్చినచెక్క పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి సున్నితంగా మర్దన చేయాలి. పదినిమిషాల తరవాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మిశ్రమం రాయడం వల్ల మొటిమలకు కారణమైన బ్యాక్టీరియా తొలగిపోతుంది. చర్మానికి రక్తప్రసరణ జరిగి మచ్చలు పోతాయి.

  • ఒక గిన్నెలో రెండు చెంచాల శనగపిండి, మూడు చెంచాల గులాబీ నీళ్లు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పావుగంటసేపు ఆరనివ్వాలి. తరవాత ముఖంపై నీళ్లు చిలకరించుకుంటూ శుభ్రం చేసుకోవాలి. ఈ మిశ్రమం రాయడం వల్ల చర్మ రంధ్రాల్లో పేరుకున్న మురికి వదిలిపోతుంది. చర్మానికి తగినంత తేమ, ఆక్సిజన్‌ అంది మొటిమల బాధ తగ్గుతుంది. క్రమంగా చర్మం మృదువుగా మారుతుంది.

ఇవి కూడా చదవండి:

చిత్రం భళారే విచిత్రం

Yogi Adityanath: యోగి విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

కొబ్బరి నీళ్ల కంటే.. మంచి నీళ్లు మేలు.. డాక్టరేంటి ఇలా అన్నాడు..

Updated Date - Mar 27 , 2025 | 02:57 AM