Eyesight Tips : ఈ చిట్కాలు పాటించారంటే.. కళ్ళద్దాలతో పనే ఉండదు..!
ABN , Publish Date - Apr 23 , 2024 | 04:10 PM
మన ఆరోగ్యం మీద ఎంత శ్రద్ధ చూపిస్తాయో, అంతే శ్రద్ధను కళ్ళ విషయంలో కూడా చూపించాలి. చిన్న సమస్య ఉన్నా డాక్టర్ దగ్గరకు వెళ్ళి తగిన చికిత్స తీసుకుంటూ ఉండాలి. అయితే ముఖ్యంగా కంటి సమస్యలు పెరిగేందుకు ముఖ్య కారణం స్క్రీన్ టైమింగ్ పెరగడం ఇది చిన్నవారిలోనూ, పెద్దవారిలోనూ ఈ మధ్య కాలంలో కాస్త ఎక్కువగా ఉన్న చెడు అలవాటు. దీనితోనే కంటి సమస్యలు పెరుగుతున్నాయి.
సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అంటారు. అన్ని అవయవాల్లోకి కళ్ళు అతి ముఖ్యమైనవి. కంటి చూపు బావుంటేనే ప్రకృతిలో అందాలను చూసి ఆనందించే శక్తి ఉంటుంది. మన ఆరోగ్యం మీద ఎంత శ్రద్ధ చూపిస్తాయో, అంతే శ్రద్ధను కళ్ళ విషయంలో కూడా చూపించాలి. చిన్న సమస్య ఉన్నా డాక్టర్ దగ్గరకు వెళ్ళి తగిన చికిత్స తీసుకుంటూ ఉండాలి. అయితే ముఖ్యంగా కంటి సమస్యలు పెరిగేందుకు ముఖ్య కారణం స్క్రీన్ టైమింగ్ పెరగడం ఇది చిన్నవారిలోనూ, పెద్దవారిలోనూ ఈ మధ్య కాలంలో కాస్త ఎక్కువగా ఉన్న చెడు అలవాటు. దీనితోనే కంటి సమస్యలు పెరుగుతున్నాయి. అశ్రద్ధగా ఉండటం, చెడు అలవాట్లు, సరైన ఆహారం తీసుకోకపోవడం, కంటి సమస్యలు పెరిగేందుకు అవకాశంగా మారుతున్నాయి. దీనికోసం ఏంచేయాలంటే..
1. కంటి చూపు విషయంలో చిన్న తేడా కనిపించినా ఆహారం విషయంగా శ్రద్ధ వహిస్తే వెంటనే ఫలితం ఉంటుంది.
2. చేతులతో అస్తమానూ కంటిని తాకడం మంచిది కాదు. దీనితో చేతులకు ఉన్న వైరస్, బ్యాక్టీరియా సోకుతుంది. ఇలా చేయడం వల్ల కంటి ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉంటుంది.
3. కళ్ళు పొడిబారుతున్నట్టుగా అనిపిస్తే కనుక నీరు ఎక్కువగా తాగితే ఈ ఇబ్బంది తగ్గుతుంది.
Healthy Food : బియ్యానికి బదులుగా గోధుమ రవ్వను తీసుకుంటే..!
4. కళ్ళ కలక సమస్య కనుక ఉంటే తరచుగా కళ్ళను తాకకూడదు. రుద్దడం వంటివి చేయకూడదు. ఇలా చేస్తే సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
5. కంటి వ్యాయామాలను చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే కంటి కండరాలు బలంగా మారతాయి.
6. కంటి సమస్యలు మనం తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు వాటి వల్ల వచ్చే ఒత్తిడి వల్ల కూడా రావచ్చు. నిద్రలేమితో మొదలై కంటి చూపు మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
Sleep Changes: మహిళల్లో నిద్ర లేమి సమస్యలు ఎందుకు వస్తాయంటే..!
7. ధూమపానం, మధ్యపానం అలవాట్ల వల్ల మాక్యులర్ డిజెనరేషన్, కంటి శుక్లాలు వంటి సమస్యలు పెరిగేందుకు అవకాశం ఉంటుంది.
8. వాతావరణంలో మార్పులు, ముఖ్యంగా ఎండాకాలం సూర్యకిరణాలు నేరుగా కంటి మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండలో వెళ్ళేప్పుడు కంటి అద్దాలను ధరించడం మంచిది.
Walk after eating : రాత్రి తిన్న తర్వాత నడుస్తున్నారా? దీనివల్ల కలిగే లాభాలేంటో తెలుసా?
9. స్త్రీన్ టైం తగ్గించడం, రాత్రి త్వరగా పడుకోవడం వంటి అలవాట్లను చేసుకుంటే కంటి సమస్యలు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
10. కంటి ఆరోగ్యం కోసం ఎ విటమిన్ ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.
Read Latest Navya News and Thelugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.