Maybach Sales: యువతకు లగ్జరీ కార్లపై మక్కువ.. వారానికి పది మేబ్యాక్ కార్ల విక్రయం
ABN , Publish Date - Mar 26 , 2025 | 03:14 PM
భారత్‌లో గత ఏడాది వారానికి 10 మేబ్యాక్ లగ్జరీ కార్లు అమ్ముడుపోయాయి. ఈ విషయాన్ని సంస్థ తాజాగా ప్రకటించింది. కార్ల కొన్న వాళ్ల సగటు వయసు 38 ఏళ్లని కూడా వెల్లడించింది.

ఇంటర్నెట్ డెస్క్: శాలరీల్లో తగ్గుదల, ఉద్యోగాల్లో కోతలు, కానరాని ఇంక్రిమెంట్లు.. ఓవైపు దేశంలో ఇలాంటి వార్తలు తరచూ వినిపిస్తుంటే మరోవైపు ఇందుకు భిన్నమైన ఆర్థిక ముఖచిత్రం ఆవిష్కృతమవుతోంది. దేశంలో విలాసవంతమైన లగ్జరీ కార్లకు డిమాండ్లు అంతకంతకూ పెరుగుతూ మార్కెట్ వర్గాలను కూడా సర్‌ప్రైజ్ చేస్తున్నాయి. ఇందుకు తాజాగా ఉదాహరణగా మేబ్యా్క్ కార్ల అమ్మకాలు నిలుస్తున్నాయి.
మెర్సిడీజ్ బెంజ్ సంస్థకు మేబ్యాక్ బ్రాండ్ కార్లు అంటేనే లగర్జీకి పర్యాయపదం. ఈ కార్లను ఒకప్పుడు రాజవంశీయులు మాత్రమే కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం భారత్‌లో ఈ కారు ప్రారంభ ధర రూ.3 కోట్లు. అయినా కానీ కార్ లవర్స్ మాత్రం వెనక్కు తగ్గట్లేదు. గతేడాది సంస్థజజ వారానికి సగటు పది మేబ్యాక్ కార్ల చొప్పున అమ్మింది. తద్వారా అమ్మకాల్లో ఏకంగా 145 శాతం వృద్ధి నమోదు చేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 2024లో మొత్తం 21,800 కార్లను విక్రయించగా భారత్‌లో 500 పైచిలుకు మేబ్యాక్ కార్లను జనాలు కొనుగోలు చేశారు. భవిష్యత్తులో కూడా ఈ డిమాండ్ కొనసాగుతుందని సంస్థ భావిస్తోంది.
Read Also: భారతీయ వినియోగదారుల వెతలు.. కస్టమర్‌కేర్‌లో ఫిర్యాదులకు 1500 కోట్ల గంటలు
‘‘మేబ్యాక్ కార్లకు భారత్‌లో 100 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ బ్రాండ్ భారత్‌లో ఎలా వృద్ధి చెందుతోందో చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. గతేడాది కార్ల విక్రయాల విక్రయాలతో ప్రపంచంలో టాప్ కంపెనీల్లో ఒకటిగా నిలిచాము’ అని సంస్థ గ్లోబల్ హెడ్ డేనియల్ లెస్కో అన్నారు.
యువతే ఈ కార్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని డేనియల్ తెలిపారు. వీటిని సొంతం చేసుకుంటున్న వారి సగటు వయసు 38 ఏళ్లేనని అన్నారు. యువతలో తమ బ్రాండ్‌పై మక్కువ పెరుగుతోందని చెప్పారు. భారతీయులకు తమ కొనుగోలు చేసే వస్తువులపై మంచి అవగాహన ఉంటోందని కితాబునిచ్చారు.
Also Read: గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌కు కేంద్రం స్వస్తి
భారత్‌లో అల్ట్రా లగ్జరీ కార్ల మార్కెట్‌లో మేబ్యాక్ కూడా ముందున్న విషయం తెలిసిందే. 2015 నుంచి పూణెలోని ఫ్యాకటరీలో ఎస్580 మోడల్ కారును అసెంబుల్ చేసి విక్రయిస్తోంది. వచ్చే ఏడాది నుంచి భారత్‌లో ఎస్ఎల్680 మోడల్ విక్రయాలను కూడా ప్రారంభించనుంది.