EPFO: ఈపీఎఫ్ఓ కొత్త సౌకర్యం..యూపీఐ లింకప్ సహా క్యాష్ విత్ డ్రా కూడా..
ABN , Publish Date - Mar 26 , 2025 | 03:00 PM
EPFO సభ్యులకు అదిరిపోయే వార్త వచ్చేసింది. ఏంటంటే మరికొన్ని రోజుల్లో PF ఉపసంహరణను UPI ద్వారా నిమిషాల్లోనే చేసుకోవచ్చు. దీంతోపాటు ఏటీఎం నుంచి పీఎఫ్ మనీ కూడా విత్ డ్రా చేసుకునే సౌలభ్యాన్ని అందించనున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

ఇండియాలో డిజిటల్ వినియోగం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నుంచి మరో క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఈ క్రమంలో త్వరలో UPI ఆధారిత PF ఉపసంహరణ సౌకర్యాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కొత్త సౌకర్యం ద్వారా EPFO సభ్యులు UPI ద్వారా వారి PF డబ్బులను క్షణాల్లోనే ఉపసంహరించుకోవచ్చు. కార్మిక మంత్రిత్వ శాఖ, ఉపాధి కార్యదర్శి సుమితా దావ్రా స్వయంగా ఈ విషయం గురించి చెప్పారు. ఈ సౌకర్యం వల్ల PF క్లెయిమ్ ప్రక్రియ వేగవంతమవుతుందని, అర్హత ఉన్న సభ్యులకు వెంటనే డబ్బు అందుతుందని స్పష్టం చేశారు.
ఎప్పటి నుంచి ప్రారంభం
అయితే EPFO ఇప్పటికే ఈ సౌకర్యాన్ని ప్రారంభించడానికి పనులను ప్రారంభించిందని, ఇది మే చివర లేదా జూన్ ప్రారంభంలో అందుబాటులోకి రానుందన్నారు సుమితా దావ్రా. ఇప్పటివరకు, PF డబ్బులను ఉపసంహరించుకువడానికి కొంత సమయం పడుతుంది. అంటే ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో అప్లై చేసిన క్రమంలో రెండు మూడు రోజల్లో ఆయా సభ్యుల ఖాతాల్లోకి క్రెడిట్ అవుతుంది. కానీ తర్వాత వచ్చే రోజుల్లో మాత్రం PF ఖాతా దారులు మరింత తక్కువ సమయంలో డబ్బులను తీసుకునే ఛాన్సుంది. UPI లింకప్ చేయడం ద్వారా ఈ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది.
PF డబ్బు ఉపసంహరించుకోవడం ఎలా?
ఈ కొత్త మార్గం ద్వారా PF డబ్బును ఉపసంహరించుకోవడం చాలా సులభం. EPFO సభ్యులు UPI ఐడీని లింక్ చేసుకోవడం ద్వారా వారి PF డబ్బులు నేరుగా వారి బ్యాంకు ఖాతాకు వెళతాయి.
UPI ద్వారా సభ్యులు రూ. 1 లక్ష వరకు ఆటోమేటిక్‌గా PF డబ్బులను ఉపసంహరించుకునే ఛాన్సుంది
ఈ ప్రక్రియ చాలా సులభంగా, కొన్ని నిమిషాల్లోనే పూర్తవుతుంది
EPFO తన 120 కంటే ఎక్కువ డేటాబేస్‌లను అనుసంధానించి, 95% క్లెయిమ్‌లను ఇప్పటికే ఆటోమేటెడ్ చేసింది
PF ఉపసంహరణ సౌకర్యాలు
EPFO తన వినియోగ పరిమితిని కూడా విస్తరించింది. ప్రస్తుతం సభ్యులు వివాహం, ఆరోగ్యం, విద్య, గృహనిర్మాణం వంటి అనేక ముఖ్యమైన అవసరాలకు PF డబ్బులను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. ఈ మార్పు EPFO సభ్యులకు మరిన్ని సౌకర్యాలను లభించడంతోపాటు వారి అవసరాన్ని బట్టి ఫండ్‌ను ఎంచుకోవచ్చు. దీంతోపాటు వచ్చే జూన్ నుంచి ఏటీఎం కేంద్రాల నుంచి కూడా పీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని కల్పించనున్నారు. ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Hotel Booking: ఒయో రూమ్స్ కోసం ఆధార్ ఉపయోగిస్తున్నారా.. అయితే ఇలా చేయండి
Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్
Layoffs: ఎంది సామి..మళ్లీ 9 వేల లే ఆఫ్స్, ఇక మిగిలేది ఎవరు..
NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
Read More Business News and Latest Telugu News