Share News

Drinking water : రోజులో ఎవరు ఎంత నీటిని తీసుకోవాలి?

ABN , Publish Date - Apr 22 , 2024 | 11:52 AM

గర్భిణీలు, లేదా బిడ్డకు పాలు ఇస్తున్న బాలింతలు శరీరం హైడ్రేటెడ్ గా ఉండే విధంగా అదనపు నీటిని తీసుకోవాలి. హైడ్రేటెడ్‌గా ఉండటానికి శరీరం అధిక స్థాయిలో పనిచేయడానికి నీరు సహాయపడుతుంది.

Drinking water : రోజులో ఎవరు ఎంత నీటిని తీసుకోవాలి?
Drinking water,

శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు ఆహారంతో పాటు నీరు కూడా అంతే ముఖ్యం, నీటిని సరైన శాతంలో తీసుకుని హైడ్రేట్‌గా ఉండాలనేది అందరికీ తెలిసిన సంగతే. కనీసం రోజుకు నాలుగు నుండి 12 కప్పుల నీటిని తీసుకోవాలి. అయితే తక్కువ శ్రమ చేస్తున్న వారిలో ఈ నీటి శాతం సరిపోతుంది. కానీ తరచుగా వ్యాయామం చేసే వారిలో ఈ సంఖ్య ఇంకా పెరుగుతుంది. జ్వరం, లేదా ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే వాంతులు, విరేచనాలు ద్వారా ద్రవాలను కోల్పోతుంటే కనుక ద్రవ నష్టాన్ని తగ్గించడానికి ఎక్కువ నీరు త్రాగాలి. అయితే ఈ కొలమానాలతో ఎంత నీరు త్రాగాలి అనేది తెలుసుకుందాం.

ఎంత నీరు అవసరం..

1. వేడి, తేమ, పొడి ప్రాంతాల్లో నివసించే వారికి ఎక్కువ నీరు అవసరం అవుతుంది. అధిక ఎత్తు ఉన్న ప్రాంతాల్లో నివసించేవారు కూడా ఎక్కువ నీరు తీసుకోవడం ముఖ్యం.

Running : కీళ్లను బలహీనం చేసే రన్నింగ్ మిస్టేక్స్ ఇవే.. !

2. కాఫీ, లేదా ఇతర కెఫీన్ వంటి పానీయాలను ఎక్కువగా తీసుకుంటే మూత్రవిసర్జన ద్వారా ఎక్కువ నీటిని కోల్పోతారు. తక్కువ కెఫిన్ పానీయాలు తాగడం, నీటిని ఎక్కువ తీసుకోవడం చేయాలి.

3. తాజా పండ్లు, కూరగాయలు వంటివి తినవివారు నీరు ఎక్కువగా తాగాల్సి ఉంటుంది.

4. పర్యావరణం అంటే ఎండ, వేడి ఉష్ణోగ్రతలలో ఆరుబయట గడిపినట్లయితే పెరిగిన చెమట కారణంగా ఎక్కువగా నీటిని తీసుకోవడం అవసరం.

5. గర్భిణీలు లేదా బిడ్డకు పాలు ఇస్తున్న బాలింతలు శరీరం హైడ్రేటెడ్ గా ఉండే విధంగా అదనపు నీటిని తీసుకోవాలి.


Summer heat : సమ్మర్ హీట్‌కి చెక్ పెట్టే సమ్మర్ డ్రింక్స్ తీసుకుంటే..!

హైడ్రేటెడ్‌గా ఉండటానికి శరీరం అధిక స్థాయిలో పనిచేయడానికి నీరు సహాయపడుతుంది. దీనికి..

1. తక్కువ పొడి చర్మాన్ని ప్రోత్సహిస్తుంది.

2. అధిక చక్కెర ఉన్న పానీయాలను తీసుకున్నప్పుడు ఎక్కువ నీటిని తీసుకుంటే బరువు పెరిగే అవకాశం తక్కువ ఉంటుంది.

3. ఆరోగ్యకరమైన మూత్రాశయం, మూత్ర పిండాల పనితీరును నీరు పెంచుతుంది.

4. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

5. ఆరోగ్యకరమైన కీళ్లను ప్రోత్సహిస్తుంది.

మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Apr 22 , 2024 | 11:54 AM