peppermint oil : ఈ పిప్పర్మింట్ ఆయిల్‌ని తలకు రాసి చూసారా.. ? ఎన్ని లాభాలంటే..!
ABN , Publish Date - Jan 13 , 2024 | 01:21 PM
ఆస్తమా, బ్రోన్కైటిస్, అలెర్జీలు వంటి శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడేవారి లక్షణాలును తగ్గించడానికి పిప్పర్‌మెంట్ సహాయపడుతుంది.
కాలం మారుతున్న కొద్దీ వాతావరణంలో వచ్చే మార్పులు ఆరోగ్యం మీదా ప్రభావాన్ని చూపుతాయి. కాలానికి తగినట్టు శ్రద్ధ తీసుకోకపోతే అనారోగ్యాల బారిన పడక తప్పదు. శరీరంలో ఏ చిన్న మార్పు వచ్చినా కూడా అది ముఖ్యంగా జుట్టు మీదనే కనిపిస్తుంది. అనారోగ్య లక్షణాలు ఉన్నట్లయితే జుట్టు రాలిపోవడం, లేదా కళ తగ్గిపోవడం వంచివి కనిపిస్తాయి. జుట్టును ఒత్తుగా ఉంచేందు చాలా రకాల ఉత్పత్తులనే వాడుతున్నా జుట్టు రాలే సమస్యకు రోజుకో కొత్త ప్రోడక్ట్ మార్కెట్ లోకి వస్తూనే ఉన్నాయి.
పిప్పర్మింట్ ఆయిల్ వాయుమార్గాలను ఉపశమనానికి, తెరవడానికి సహాయపడుతుంది. ఆస్తమా, బ్రోన్కైటిస్, అలెర్జీలు వంటి శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడేవారి లక్షణాలును తగ్గించడానికి పిప్పర్‌మెంట్ సహాయపడుతుంది. పిప్పర్‌మెంట్ నూనెలో రిఫ్రెష్, ఉత్తేజపరిచే సువాసన ఉంటుంది, ఇది మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే సహజంగా జుట్టుకు పెరుగుదలకు వాడే ఉత్పత్తులలో మింట్ ఆయిల్ ఒకటి. పిప్పర్మింట్ ఎసెన్షియల్ ఆయిల్ ని ఉపయోగించడం వల్ల జుట్టు సంరక్షణ, చర్మ సంరక్షమ వరకూ అనేక ప్రయోజనాలున్నాయి. జుట్టు పెరుగుదలను మెరుగుపరిచే ఉత్తమమైన ఆయిల్ ఇది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.
కొబ్బరి, బాదంల జోజోబా నూనెలు జుట్టు పెరుగుదలపై ప్రభావాన్ని చూపుతాయి. ఇవన్నీ జుట్టు తేమగా మారేందుకు, బలంగా ఉండేందుకు ఉపయోగపడతాయి. ఈ మింట్ ఆయిల్ జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. స్కాల్ఫ్ ఆరోగ్యాన్ని పెంచడంలో శీతలీకరణ అనుభూతిని అందించడంలో మింట్ ఆయిల్ సహకరిస్తుంది.
ఇది కూడా చదవండి: బాదం నాణ్యతను ఎలా తెలుసుకుంటారు? ఈ చిట్కాలు ట్రైచేసి చూడండి..!
ఈ మింట్ ఆయిల్ స్కాల్ఫ్ ఆరోగ్యాన్ని పెంచుతుంది. దురద నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అలాగే చర్మానికి, జుట్టుకు కూడా రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడుతుంది.
చుండ్రు, పేను, దురదను తగ్గించడానికి 10 ml హెయిర్ ఆయిల్ తో 3 చుక్కలను కలపండి. తలకు 15 నుండి 20 నిమిషాల పాటు మసాజ్ చేసిన తర్వాత, 2 చుక్కలను 1 టేబుల్ స్పూన్ క్యారియర్ ఆయిల్‌తో కలిపి కడిగేయండి.
ఈ నూనెను ఎలా ఎంచుకోవాలి..
1. ఎంచుకున్న పిప్పరమెంటు నూనెలో మలినాలు, రసాయనాలు లేవని నిర్ధారించుకోవాలి.
2. నూనె, లేబుల్ హెర్బిసైడ్లు, క్రిమిసంహారకాలు, ఇతర ప్రమాదకరమైన పదార్ధాలు లేనిదని తెలుసుకున్నాకే వాడాలి.
3. ఈ నూనెను ఎంచుకునేప్పుడు 100 శాతం స్వచ్ఛమైన నూనెలను తీసుకోవాలి. మింట్ నూనెను వాడాకా రిడల్ట్ అతి త్వరగా ఉంటుంది.