Share News

Sabja Seeds: సబ్జా గింజలు రోజుకు ఎన్ని తింటున్నారు.. ఇంతకు మించి తీసుకుంటే..

ABN , Publish Date - Mar 31 , 2025 | 02:50 PM

Sabja Seeds Benefits and Side effects: అనేక ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి బయటపడటానికి సబ్జా గింజలు ఎంతో ఉపయోగపడతాయి. కానీ, ఈ విత్తనాలు రోజుకు ఇంతకుమించి తింటే లేనిపోని సమస్యలు వస్తాయి. అంతేగాక, ఈ సమస్యలు ఉన్నవాళ్లు సబ్జా గింజలు అస్సలు తినకూడదు.

Sabja Seeds: సబ్జా గింజలు రోజుకు ఎన్ని తింటున్నారు.. ఇంతకు మించి తీసుకుంటే..
sabja seeds

Sabja Seeds Uses and Side effects: ఆరోగ్యానికి చాలా మంచిదని సబ్జా గింజలు నీళ్లలో నానబెట్టుకుని తింటూ ఉంటారు చాలామంది. తులసి మొక్కల నుంచి వచ్చే ఈ విత్తనాలు శరీరంలో వేడిని తగ్గిస్తాయి. వీటిలో ఉండే పోషకాలకు చలువను పెంచే గుణం ఉంటుంది. ఇవి అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడేందుకు సాయపడతాయి. ఎన్నో విధాలుగా మేలు చేసే సబ్జా గింజలు లేదా బాసిల్ సీడ్స్ అధికంగా తీసుకుంటే అనేక దుష్ప్రభావాలకు దారితీయవచ్చు. అందుకే రోజుకు ఎంత పరిమాణంలో సబ్జా గింజలు తినాలి.. ఎవరు వీటికి దూరంగా ఉండాలో తెలుసుకుందాం.


సబ్జా గింజల ప్రయోజనాలు

సబ్జా గింజల్లో అధిక మొత్తంలో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని నివారిస్తుంది. సబ్జా గింజలను నానబెట్టినప్పుడు జెల్లీ లాంటి పదార్థం ఏర్పడుతుంది. ఇది కడుపులో ఎసిడిటి తగ్గుతుంది. వేసవిలో వీటిని నీటిలో నానబెట్టుకుని తింటే శరీరంలో ఉష్ణోగ్రత తగ్గి డీహైడ్రేషన్ సమస్య రాదు. డయాబెటిస్ ఉన్నవారు వీటిని తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ నెమ్మదిస్తాయి.ఒత్తిడి తగ్గుతుంది. చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాల్లో ఒకటైన ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లం, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ వంటి ఖనిజాలు కూడా సబ్జా గింజల్లో సమృద్ధిగా ఉంటాయి. కొంత మొత్తంలో విటమిన్ సి, కె, ఎ, ప్రొటీన్ ఉంటాయి. రోజూ 10-15 నిమిషాలు నానబెట్టిన సబ్జా గింజలను షర్బత్, స్మూతీలలో వేసుకుని కూడా తాగవచ్చు.


సబ్జా విత్తనాల దుష్ప్రభావాలు

  • తులసి గింజలను పెద్ద మొత్తంలో తినడం వల్ల జీర్ణవ్యవస్థకు అంతరాయం కలుగుతుంది. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. వీటిని మోతాదుకు మించి తిన్నప్పుడు కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు పెరుగుతాయి.

  • హై బీపీ మందులు వాడేవారు వైద్యుడి సలహా మేరకు మాత్రమే సబ్జా విత్తనాలు తీసుకోవాలి. రక్తపోటును తగ్గించే లక్షణాలు సబ్జా గింజల్లో ఉంటాయి. అప్పటికే బీపీ మందులు వాడుతున్న వ్యక్తులు సబ్జా తింటే రక్తపోటు తగ్గి మరింత బలహీనపడే ప్రమాదముంది.

  • సబ్జాను ఎక్కువ పరిమాణంలో తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. ఇప్పటికే షుగర్ వ్యాధి కోసం మందులు తీసుకుంటున్నవారు డాక్టర్ల సలహాతో మోతాదుకు మించకుండా జాగ్రత్త పడాలి. లేకుంటే బలహీనత, తలనొప్పి లేదా తలతిరగడం వంటి సమస్యలను వస్తాయి.

  • సబ్జా గింజలు కొంతమందికి హానికరం కావచ్చు. సరిపడకున్నా తింటే శరీరంలో అలెర్జీలు రావచ్చు . చర్మంపై దురద, వాపు, దద్దుర్లు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలగవచ్చు.


  • గర్భిణీ స్త్రీలు వైద్యుడి సలహా మేరకు మాత్రమే సబ్జా గింజలను తీసుకోవాలి. ఎందుకంటే దీని వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. గర్భధారణలో సమస్యలను పెంచుతుంది.

  • సబ్జాను నానబెట్టకుండా తింటే అవి గొంతులో ఇరుక్కుపోతాయి. నానబెట్టిన తర్వాత దాని జెల్ ఆకృతి కొన్నిసార్లు శ్వాసకోశంలో అడ్డంకికి కారణమవుతుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు వీటిని తినే విషయంలో జాగ్రత్తగా తీసుకోవాలి.

  • సబ్జాను పెద్ద మొత్తంలో తీసుకోవడం వల్ల ఈస్ట్రోజెన్ హార్మోన్ ప్రభావితం అవుతుంది. ఇది ఋతుచక్రాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి మహిళలు సబ్జా గింజలను పెద్ద మొత్తంలో తినకూడదు.

  • తులసి గింజలను ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే విరేచనాలు లేదా కడుపు నొప్పి వస్తుంది. జీర్ణ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు సబ్జాను తక్కువ పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి.


రోజుకు ఎంత పరిమాణంలో తినాలి?

సబ్జా లేదా తులసి గింజలను తక్కువ పరిమాణంలో తినడమే ప్రయోజనకరం. పోషకాహార నిపుణు ప్రకారం మీరు రోజూ ఒక చెంచా లేదా దాదాపు 5 గ్రాముల సబ్జాను ఒక గ్లాసు నీటిలో నానబెట్టి ఉదయం తినాలి. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి హాని కలుగుతుందని గుర్తుంచుకోండి. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వైద్యుడిని సలహామేరకే సబ్జా గింజలు తినండి.


Read Also: Food effects Mood: మీరు ఇష్టంగా తినే ఈ 6 రకాల పదార్థాలతో వల్ల మైండ్ పనిచేయదు..

Fridge Water: వేసవిలో అదేపనిగా ఫ్రిజ్ వాటర్ తాగుతున్నారా.. అయితే ఈ

Parenting Tips: పిల్లలకు 'నో' అని తెగేసి చెప్తున్నారా..బీ కేర్‌ఫుల్.. ఈ విషయం గనక

Updated Date - Mar 31 , 2025 | 02:54 PM