Share News

Littles : మీకు తెలుసా ?

ABN , Publish Date - Aug 04 , 2024 | 12:48 AM

ధృవాల్లో ఉండే పెంగ్విన్స్‌ గుంపులు గుంపులుగా ఉంటాయి. వీటి రెక్కలు పక్షులకంటే బలమైనవి. దీంతో పాటు ఇవి వేడిగా ఉంటాయి. ముఖ్యంగా సముద్రం అడుగులో పెంగ్విన్స్‌ ఈతకొడతాయి.

Littles :  మీకు తెలుసా ?

  • ధృవాల్లో ఉండే పెంగ్విన్స్‌ గుంపులు గుంపులుగా ఉంటాయి. వీటి రెక్కలు పక్షులకంటే బలమైనవి. దీంతో పాటు ఇవి వేడిగా ఉంటాయి. ముఖ్యంగా సముద్రం అడుగులో పెంగ్విన్స్‌ ఈతకొడతాయి. అంతేకానీ గాలిలో ఎగరలేవు.

  • పెంగ్విన్స్‌ పక్షి జాతికి చెందినవి. వీటి కాళ్ల మధ్య దూరం ఉండటం వల్ల ఇవి మనిషిలా నడవగలవు.

  • వీటి నోటిలో దంతాలు ఉండవు.

  • ఇరవై రెండు మిలియన్ల క్రితం నుంచి పెంగ్విన్స్‌ ఉన్నాయని.. అది కూడా ఆస్ర్టేలియాలోనే అవి ఉండేవని పరిశోధకులు చెబుతున్నారు. న్యూజిలాండ్‌తో దక్షిణ పసిఫిక్‌ ఐలాండ్స్‌లో ఇవి కనిపిస్తాయి. వీటిలో 18 రకాల జాతులు ఉన్నాయి.

  • ఎంపరర్‌ పెంగ్విన్స్‌ అందంగా ఉంటాయి. యంగ్‌ పెంగ్విన్స్‌ ముందు భాగం తెల్లగా ఉండి.. నల్లటి మెడ ఉంటుంది. ఈ ఎంపరర్‌ పెంగ్విన్స్‌ కేవలం అంటార్కిటికాలోనే మాత్రమే జీవిస్తాయి.

  • డైనోసార్లు అంతమైంది మూడు మిలియన్ల సంవత్సరాల నుంచి అయితే.. పెంగ్విన్స్‌ చివరి శిలాజాలం 62 మిలియన్ల క్రితం అని పరిశోధకులు తేల్చారు.

  • పెంగ్విన్లు అన్నీ నలుపు, తెలుపు రంగులోనే ఉంటాయి. ఇవి ఆహారం కోసం నీటిలోకి 530 మీటర్లు సైతం డైవ్‌ చేస్తాయి.

  • వీటి సమూహాన్ని ‘రాఫ్ట్‌’ అంటారు.

  • ఉప్పగా ఉండే సముద్రం నీళ్లను తాగుతాయి. వీటిలో సోడియాన్ని ఫిల్టర్‌ చేసే నిర్మాణం ఉంటుంది. ఇది ముక్కుద్వారా వెళ్లిపోతుంది.

  • ఇవి చేపలను మాత్రమే తింటాయి. తీర ప్రాంతాల్లోకి వచ్చి గూళ్లు ఏర్పరచుకుని ఒకటి లేదా రెండు గుడ్లు మాత్రమే పెడతాయి.

  • ఎంపరర్‌ పెంగ్విన్స్‌ ఆహారం లేకుండా 115 రోజులు బతుకుతాయి.

Updated Date - Aug 04 , 2024 | 12:48 AM