Nargis Fakhri : అలా పిలవటం గొప్పగా అనిపిస్తుంది
ABN , Publish Date - Aug 25 , 2024 | 12:50 AM
ఎప్పటికప్పుడు డిఫరెంట్ లుక్స్‌తో కనపడే బాలీవుడ్ కథానాయిక నర్గీస్ ఫక్రి. ఈ అమెరికన్ భామ బాలీవుడ్‌లో ‘రాక్‌స్టార్’ కథానాయికగానే ఇప్పటికీ పాపులర్. నర్గీస్ ఫక్రి గురించి కొన్ని విశేషాలు..
ఎప్పటికప్పుడు డిఫరెంట్ లుక్స్‌తో కనపడే బాలీవుడ్ కథానాయిక నర్గీస్ ఫక్రి. ఈ అమెరికన్ భామ బాలీవుడ్‌లో ‘రాక్‌స్టార్’ కథానాయికగానే ఇప్పటికీ పాపులర్. నర్గీస్ ఫక్రి గురించి కొన్ని విశేషాలు..
ఇటీవలే సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో జిమ్ ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి. దీంతో పాటు ఈ అమ్మడు ‘మహిళలకు మజిల్స్ అవసరమే. ప్రతిరోజూ జిమ్ చేసి శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యాన్నీ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది’ అంటోంది నర్గీస్. ఈ మధ్యకాలంలో కెటిల్ బెల్ వర్కవుట్స్ చేస్తోందీమె.
అలా సినిమాల్లో అవకాశం..
నర్గీస్ అమెరికాలో పుట్టింది. తన తండ్రి పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి. పేరు మహ్మద్ ఫక్రి. ఇక తల్లి చెక్ రిపబ్లిక్‌కు చెందిన మహిళ. నర్గి్‌సకు ఆరేళ్లున్నప్పుడే పేరెంట్స్ విడిపోయారు. ఆ తర్వాత తన తండ్రి చనిపోయారు.
ఆమెరికన్ నేషనాలిటీ వచ్చింది. అయితే ఆమె గ్లోబల్ సిటిజన్‌గా చెప్పుకోవటానికే ఇష్టపడుతుంది. ఇక పదహారేళ్ల వయసులోనే నర్గీస్ మోడల్‌గా అడుగుపెట్టింది. ఫ్యాషన్‌గాళ్‌గానే కాకుండా మోడల్‌గా క్రేజ్ సంపాదించింది. 2009 సమయంలో మనదేశంలోని కింగ్ ఫిషర్ క్యాలెండర్ గాళ్‌గా కనపడింది. అలా ఆమెకు పేరొచ్చింది. ‘ఒక రోజు డెన్మార్క్‌లో షూటింగ్ ఉన్నా. ఒక ఈమెయిల్ వచ్చింది.
ఇండియన్ మూవీలో నటించాలని ఆ మెయిల్ సారాంశం. అయితే నమ్మటం కష్టమన్నాను. చివరికి మీకు హిందీ నేర్పిస్తాం. నేను ఫలానా డైరక్టర్ దగ్గర అసిస్టెంట్‌గా పని చేస్తాను. మీరు ఒకసారి ముంబై రండి అని చెప్పారు. దీంతో ఇక్కడికొచ్చాను. ఆడిషన్‌లో పాల్గొన్నా. ఆ సినిమానే ‘రాక్‌స్టార్’. అలా బాలీవుడ్ కథానాయికగా కెరీర్‌ను ఆరంభించాను’ అంటుందీమె.
అలా ఊహించలేదు..
ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ మ్యూజికల్ స్టోరీలో నర్గీస్ నటకు మంచి మార్కులు పడ్డాయి. సినిమా కూడా సూపర్ హిట్ అవటంతో ఆమెకు అవకాశాలు వచ్చాయి. ‘తొలి సినిమానే సూపర్ హిట్ అవుతుందని ఊహించలేదు.
ఆ సమయంలో ఎలాంటి సినిమాలు ఎంచుకోవాలనే ఆలోచన కూడా కోల్పోయాను. తొలి సినిమానే విజయం సాధించటంతో గ్రేట్‌గా ఫీలయ్యా. ఇప్పటికీ రాక్‌స్టార్ హీరోయున్ అనే పిలుస్తారు.
ఇదెంతో గొప్పగా అనిపిస్తుంది. శ్రీలంక సివిల్ వార్ నేపథ్యంలో వచ్చిన ‘మద్రాస్ కేఫ్’లో నటించింది. ‘పాత పోస్టర్ నిఖ్‌లా హీరో’, ‘కిక్’ చిత్రాల్లో ఆమె చేసిన ఐటమ్ సాంగ్స్ మంచి పేరు తీసుకొచ్చాయి. ‘స్పై’ అనే హాలీవుడ్ చిత్రంలో నటించింది.
‘హౌస్‌ఫుల్ 3’, ‘అమవాస్’, ‘తొర్బాజ్’ లాంటి చిత్రాల్లో నటించినా ఆమెకు పెద్దగా పేరు రాలేదు. దీంతో ఆమె కెరీర్ ముగిసినట్లే అనుకున్నారు. అయితే ప్రస్తుతం ‘హరి హర వీర మల్లు’ చిత్రంలో నటిస్తోంది.
అదే నా ఆశ..
ముంబైలోని స్ర్టీట్ ఫుడ్ తినటం అంటే చాలా ఇష్టం. చాలా సార్లు సిక్ అయ్యాను. అయితే తినకుండా ఉండలేనంటుంది నర్గిస్. ‘ఇంట్లో బటర్ చికెన్ వండుతాను. అది కూడా ఇన్‌స్టా వీడియోలను చూసి. ఒకప్పుడు కాఫీ ఎక్కువగా తాగేదాన్ని. ఇండియాలో ఉన్నా కాబట్టి టీకి బానిసయ్యాను’ అంటుందీమె.
ఒకప్పుడు ఎక్కువగా చాక్లెట్స్ తినేదట. ఇప్పుడు మానేసింది. ‘రణ్‌బీర్ కపూర్, వరుణ్ ధావన్, ఇలియానా.. ఇలా అందరం షూటింగ్ టైమ్‌లో హోమ్ ఫుడ్ షేర్ చేసుకునేవాళ్లం. ఇప్పటికీ నా బెస్ట్ కథానాయకుడు రణ్బీర్ కపూర్. అతనే ‘రాక్‌స్టార్’ అంటుంది నర్గీస్.
ఇకపోతే ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లో, వెబ్‌సిరీ్‌సలో తనకు మంచి పాత్రలు దొరుకుతాయని ఆమె ఆశగా ఎదురుచూస్తోంది. విభిన్నమైన కథల్లో నటించినప్పుడే సత్తా తెలుసుకోవచ్చు అంటుంది నర్గిస్. ‘కాబోయే వరుడు ఇండియన్ అయి ఉండాలనుకుంటాను’ అంటూ మనసులో మాటను చెబుతుంది నర్గిస్ ఫక్రీ.