UK: లండన్ పోస్టాఫీసులో భారత సంతతి వ్యక్తి దోపిడీ..ఏప్రిల్ ఫూల్స్ డే నాడు..
ABN , Publish Date - Apr 08 , 2024 | 07:07 PM
లండన్‌లోని ఓ భారత సంతతి వ్యక్తి ఏప్రిల్ 1న నకిలీ తుపాకీతో పోస్టాఫీసు సిబ్బందిని బెదిరించి డబ్బుతో పారిపోయాడు. నిందితుడిని ఇటీవలే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఎన్నారై డెస్క్: ఇటీవల లండన్‌లో (London) ఓ భారత సంతతి వ్యక్తి ఏప్రిల్ ఒకటో తేదీన స్థానిక పోస్టాఫీసులో దోపిడీకి పాల్పడ్డాడు. నకిలీ తుపాకీతో (Fake Firearm) అక్కడి సిబ్బందిని బెదిరించి నోట్ల కట్టలతో ఉడాయించాడు (Indian Orgin Man Rob London Post Office). రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని తాజాగా అరెస్టు చేశారు.
USA: 99 ఏళ్ల భారతీయ మహిళకు అమెరికా పౌరసత్వం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఏప్రిల్ 1న వెస్ట్ లండన్‌లోని హౌన్సలో ప్రాంతంలోగల ఓ పోస్టాఫీసులో దోపిడీ జరిగింది. నిందితుడు రాజ్‌వీందర్ కహ్లోన్ (41) స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు పోస్టాఫీసులోకి వెళ్లి అక్కడున్న ఇద్దరు సిబ్బందినీ తన నకిలీ తుపాకీతో బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేశారు. తుపాకీని చూడగానే భయపడిపోయిన వారు అతడు అడిగిన మొత్తాన్ని ఇచ్చేశారు. మొత్తం 1.36 లక్షల పౌండ్లతో రాజ్‌వీందర్ అక్కడి నుంచి ఉడాయించాడు.
ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ఏప్రిల్ 4న నిందితుడిని హాన్స్‌లోలోని అతడి ఇంట్లోనే అరెస్టు చేశారు. అతడి నకిలీ తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్ 6న నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టామని, అతడిపై దోపిడీ, నకిలీ తుపాకీతో బెదిరింపులకు దిగడం తదితర నేరాల కింద కేసు నమోదు చేశామని పోలీసులు ఓ ప్రకటనలో తెలియజేశారు. త్వరలో అతడికి శిక్ష ఖరారు కానుందని.
మరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి