AP Politics: బాబోయ్.. ఎంపీగా పోటీపై మళ్లీ ట్విస్ట్ ఇచ్చిన పవన్!
ABN , Publish Date - Mar 14 , 2024 | 08:04 PM
AP Elections 2024: జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఎమ్మెల్యేతో పాటు ఎంపీగా కూడా పోటీ చేస్తారా..? అది కూడా కాకినాడ (Kakinada) పార్లమెంట్ స్థానమేనా..? సేనాని హస్తిన పర్యటన తర్వాత అటు జనసైనికుల్లో.. ఇటు టీడీపీ శ్రేణుల్లో వచ్చిన మొట్ట మొదటి ప్రశ్న ఇదే..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఎమ్మెల్యేతో పాటు ఎంపీగా కూడా పోటీ చేస్తారా..? అది కూడా కాకినాడ (Kakinada) పార్లమెంట్ స్థానమేనా..? సేనాని హస్తిన పర్యటన తర్వాత అటు జనసైనికుల్లో.. ఇటు టీడీపీ శ్రేణుల్లో వచ్చిన మొట్ట మొదటి ప్రశ్న ఇదే. ఎన్డీఏలో చేరిక కోసం బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో సుదీర్ఘ చర్చల అనంతరం.. పవన్ ఢిల్లీలో ఉండగానే ఇదే చర్చ జరిగింది. అయితే.. ఎంపీగానా..? ఎమ్మెల్యేగా పోటీచేయాలా..? అనేదానిపై గురువారం సాయంత్రంతో జనసేనాని ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. తాను పిఠాపురం (Pithapuram) నుంచే పోటీచేస్తానని స్వయంగా ప్రకటించేశారు. పనిలో పనిగా తాను ఎంపీగా పోటీచేస్తారన్న వార్తలపై కూడా పవన్ స్పందించారు. ఈ ప్రకటనతో పెద్ద ట్విస్టే ఇచ్చారు సేనాని. ఈ సడన్ ట్విస్ట్‌తో మళ్లీ ఆలోచనలో పడ్డారు జనసైనికులు.
AP Elections 2024: పవన్ ‘పిఠాపురం’ప్రకటనపై ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్.. ఇది చూశారో..?
ఇదిగో క్లారిటీ..!
‘నన్ను ఎంపీగా పోటీ చేయాలని అంటున్నారు. నేను ప్రస్తుతానికి ఎంపీగా పోటీచేయాలని ఆలోచనే లేదు. ఎంపీగా పోటీచేస్తే క్రాస్ ఓటింగ్ జరుగుతుందా..? అనే చర్చ జరిగింది. 2104లో పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ నుంచి పిఠాపురం నుంచి పోటీ చేయాలని కోరారు. ఇప్పుడు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను. నా మనసులో ఎమ్మెల్యేగా పోటీచేయాలని ఉంది. నేను ఎంపీగా పోటీ చేస్తానా..? లేదా..? అనేది కొద్ది రోజుల్లో తెలుస్తుంది. ఇప్పుడే పోటీపై అవును.. లేదా.. కాదు..? అనేది నేను చెప్పలేను’ అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. అంటే పక్కాగా పోటీచేస్తారు కానీ.. అధికారిక ప్రకటన మాత్రం కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందని.. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రకటన సందర్భంగా.. ‘నేను అధికారం కోసం కాదు.. మార్పు కోసం వచ్చాను. అన్యాయం జరిగితే మనిషి తిరగబడేలా ధైర్యం ఇచ్చేందుకు వచ్చా. వైసీపీపై గానీ.. జగన్‌పై గానీ వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదు. మీరు మమ్మల్ని తొక్కేస్తామంటే.. మేమూ తొక్కేస్తాం. తగ్గే కొద్దీ ఎదుగుతాం తప్ప.. నాశనం ఉండదు. కూటమితో కలిసి జగన్ తోకను కత్తిరించబోతున్నాం. అధికారంలోకి వచ్చాక ప్రతినెలా జనవాణి నిర్వహిస్తాం. వైసీపీ రౌడీమూకలకు జనసేన శక్తిని చూపిస్తాం. ఏపీని చీకటి నుంచి వెలుగులోకి తీసుకురావాలి’ అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.
TDP: కీలక నేతలతో గంటా శ్రీనివాస్ మీటింగ్.. భవిష్యత్ కార్యాచరణపై చర్చ
అంతా ఓకే కానీ..!
వాస్తవానికి కాకినాడ (Kakinada) ఎంపీగా పవన్ పోటీచేస్తారని ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు వార్తలు గుప్పుమన్నాయి. ఎమ్మెల్యేతో పాటు ఎంపీగా కూడా పోటీచేస్తారని ప్రచారం జరిగింది. ఎందుకంటే.. ఎంపీగా పోటీచేస్తే.. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల వరకు ప్రభావితం చేయవచ్చన్నది ప్రధాన టార్గెట్ అని తెలుస్తోంది. కాకినాడ కీలక నియోజకవర్గం కావడం.. ఈ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాలన్నింటిలోనే కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండటంతో ఇక్కడ్నుంచే పోటీచేయాలని పవన్ భావిస్తున్నట్లు తెలిసింది. కాకినాడ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, జగ్గంపేట, పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గాలు కాకినాడ పరిధిలోకి వస్తాయి. ఎంపీగా పోటీచేస్తే ఎన్డీయేలో భాగస్వామిగా కేంద్రమంత్రి అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై పవన్ కాస్త హింట్ ఇచ్చారు కానీ.. త్వరలోనే ఎంపీ పోటీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలే మెండుగా ఉన్నాయని తెలుస్తోంది. ఫైనల్‌గా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Pawan Kalyan: పిఠాపురంలో పవన్‌పై వైసీపీ నుంచి పోటీ చేసేదెవరు..?
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..