Share News

Ganesh Chaturthi: నేడు వినాయకుడికి ఈ 7 స్వీట్స్ నైవేద్యంగా పెడితే లైఫ్‌లో విజయం!

ABN , Publish Date - Sep 07 , 2024 | 10:38 AM

సకల విఘ్నాలనూ తొలగించే విఘ్నేశ్వరుడికి తీపి పదార్థాలు ఎంతో ఇష్టం. కాబట్టి, వినాయక చవితి రోజున స్వామికి వారికి స్వీట్స్ నైవేద్యంగా పెడితే ఎంతో ఫలప్రదమని పురాణాలు చెబుతున్నాయి.

Ganesh Chaturthi: నేడు వినాయకుడికి ఈ 7 స్వీట్స్ నైవేద్యంగా పెడితే లైఫ్‌లో విజయం!

ఇంటర్నెట్ డెస్క్: సకల విఘ్నాలనూ తొలగించే విఘ్నేశ్వరుడికి తీపి పదార్థాలు ఎంతో ఇష్టం. కాబట్టి, వినాయక చవితి రోజున స్వామి వారికి స్వీట్స్ నైవేద్యంగా పెడితే ఎంతో ఫలప్రదమని పురాణాలు చెబుతున్నాయి. స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన మోదకాలతో పాటు మరో ఆరు రకాల తీపి పదార్థాలు నైవేద్యంగా పెడితే జీవితంలో సుఖసంతోషాలు సిరిసంపదలు వెల్లివిరుస్తాయి. మరి నేడు స్వామి వారికి సమర్పించాల్సిన నైవేద్యాలు ఏమిటో, వాటితో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం (Ganesh Chaturthi).

Modak Laddu: నేడు తప్పనిసరిగా గణనాథుడికి నైవేద్యంగా సమర్పించాల్సిన స్వీట్ ఇది!


  • గణనాథుడికి మోదక లడ్డూలు అత్యంత ఇష్టం. కొబ్బరి, బెల్లం, బియ్యపు పిండితో చేసే ఈ స్వీట్ నైవేద్యంగా పెట్టే భక్తుల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. జ్ఞానం కలిగి జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించగలుగుతారు.

  • శనగపిండి, చక్కెర, నెయ్యితో చేసే భారతీయ సంప్రదాయ వంటకం లడ్డూలు. లడ్డూల గుండ్రటి ఆకారం పరిపూర్ణత్వానికి సంకేతం. ఇందులోని తీపి మధురమైన జీవితానికి చిహ్నం. లడ్డూలు నైవేద్యంగా సమర్పిస్తే జీవితం ఫలవంతమవుతుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు.

  • పాలు, చక్కెరతో చేసే బర్ఫీని కూడా కొందరు నైవేద్యంగా స్వామికి సమర్పిస్తారు. దీంతో భక్తులకు శక్తి, ధైర్యం, పట్టుదల కలుగుతాయట. జీవితంలో సవాళ్లను సులువుగా ఎదుర్కొనే శక్తిసామర్థ్యాలు సొంతమవుతాయి.

  • రింగురింగులుగా ఉండే జిలేబీ జీవన ప్రయాణానికి సంకేతం. ఇందులో తీపి జీవితంలో మాధ్యుర్యానికి చిహ్నం. కాబట్టి, దీన్ని నైవేద్యంగా సమర్పిస్తే జీవితంలో ఉల్లాసం, సంతోషం, సానుకూల దృక్పథం అలవడతాయి.


  • స్వామికి నైవేద్యం పెట్టే స్వీట్లల్లో కాజూ బర్ఫీ కూడా ఒకటి. ఇందులోని జీడి పప్పులు సమృద్ధికరమైన జీవితానికి, సుఖసౌఖ్యాలకు సంకేతం. కాబట్టి, దీనితో సకల సంపదలు, సౌభాగ్యం అందుతాయట. అదృష్టం కలిసొస్తుందట.

  • యోగర్ట్‌తో చేసే శ్రీఖండ్ స్వీట్‌ను కూడా స్వామి వారికి నైవేద్యంగా పెడతారు. ఇందులోని యోగర్ట్ స్వచ్ఛతకు చిహ్నం. దీన్ని నైవేద్యంగా పెట్టే భక్తులకు శాంతిసౌఖ్యాలు లభిస్తాయి.

  • ఇక హల్వా నైవేద్యంగా పెడితే జ్ఞానం, తెలివితేటలు, ఆధ్యాత్మిక సంపద లభిస్తాయని భక్తుల విశ్వాసం

Read Latest and Viral News

Updated Date - Sep 08 , 2024 | 12:22 PM