Share News

Dairy Farmer : మహిళా స్ఫూర్తి.. ఆవులతో బిజినెస్.. నెలకు రూ.7లక్షల పైగా సంపాదన..!

ABN , Publish Date - Jan 26 , 2024 | 12:53 PM

43 ఏళ్ల రైతు రాజేశ్వరి పాడిపరిశ్రమలో పూర్తి పట్టుదల, అంకితభావంతో చేపట్టిన వ్యాపారంలో రాజేశ్వరి 46 ఆవులతో ప్రతిరోజు 650 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తూ అభివృద్ధి చెందుతున్న సంస్థగా మార్చుకుంది.

Dairy Farmer : మహిళా స్ఫూర్తి.. ఆవులతో బిజినెస్.. నెలకు రూ.7లక్షల పైగా సంపాదన..!
dairy farmer

ఆడవారు తలుచుకుంటే ఏ పనిలో అయినా విజయాన్ని సాధించగలరు. ఇదే మాటను తన జీవితానికి అన్వయించుకుంది రాజేశ్వరి. మహిళా రైతుగా మారి ఆరు ఆవులతో తన పాల వ్యాపారాన్ని అగ్ర స్థాయికి తీసుకువెళ్ళింది. ఆమె సాధించిన విజయాలు ఇప్పుడు అనేక అవార్డులను, పెద్ద గుర్తింపును తెచ్చిపెట్టాయి. తన వ్యాపార ప్రయాణం ఎలా మొదలైందంటే..

తుమకూరు జిల్లా కరువు కోరటగెరె తాలూకాలో రాజేశ్వరి అనే రైతు డెయిరీ రంగంలో విజయం సాధించింది. ఐదు ఆవులతో తన పాల వ్యాపారాన్ని మొదలుపెట్టింది. అలా మొదలైన ఆమె పాల వ్యాపారం ఇప్పుడు 46 ఆవులకు చేరుకుంది. రోజూ 650 లీటర్ల పాలను ఉత్పత్తి చేయగలుగుతుంది. దీనితో పాటు పశుగ్రాసం సాగు కూడా తనే చేపట్టింది. తన ఆవులకు ఎక్కడి నుంచో ఆహారాన్ని దిగుమతి చేసుకోవడం కూడా కష్టమని తనే వ్యవసాయం చేస్తున్నారు. అయితే పాల ఉత్పత్తిని పెంచే విధంగా అధిక దిగుబడిని ఇచ్చే ఆవు జాతులపై పెట్టుబడి పెడుతున్నారు రాజేశ్వరి.

ఐదేళ్ల క్రితం కేవలం ఐదు ఆవులతో పాడి మొదలుపెట్టి తన కష్టంతోనే వ్యాపారాన్ని పెంచుకుంటూ వచ్చింది. బెంగుళూరు తుమకూరు జిల్లాలోని కరువుతో అల్లాడుతున్న కొరటగెరె తాలూకాలో ఆర్థిక భారాన్ని దాటేందుకు రాజేశ్వరి ఎంచుకున్న దారి వ్యాపారం. అదీ పెద్దగా లాభాలు కనిపించని పాడి పరిశ్రమను ఎంచుకుంది. తనకు తెలిసిన విధానంలో వ్యాపారాన్ని మొదలుపెట్టి అంచలంచెలుగా వ్యాపారాన్ని అభివృద్ధి వైపు నడుపుకుంటూ వచ్చింది. ఇప్పుడు 43 ఏళ్ల రైతు రాజేశ్వరి పాడిపరిశ్రమలో పూర్తి పట్టుదల, అంకితభావంతో చేపట్టిన వ్యాపారంలో రాజేశ్వరి 46 ఆవులతో ప్రతిరోజు 650 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తూ అభివృద్ధి చెందుతున్న సంస్థగా మార్చుకుంది.

కరువు ప్రాంతమైన తన ప్రాంతంలో తగినంత మేత దొరగడం కష్టమని సొంతంగా తనే గ్రాసాన్ని సాగు చేస్తుంది. ఆరు ఎకరాల స్థలంలో మొక్కజొన్న, పత్తి విత్తనాల సాగు చేయడానికి పొరుగు రైతుల భూమిని కౌలుకు తీసుకుంది. ఈ వ్యాపారం తన వెంచర్ ను లాభాల వైపు నడిపించిందని చెప్పుకొచ్చింది రాజేశ్వరి.

ఇదికూడా చదవండి: గోల్డెన్ మిల్క్ తీసుకుంటున్నారా.. ఈ పాలను తాగితే ఎన్ని అద్భుత ఫలితాలంటే..!!


ఇప్పుడు తన దగ్గర జెర్సీ, హోల్ స్టెయిన్ ఫ్రైసియన్ జాతులు అధిక పాల దిగుబడిని ఇచ్చే మేలు జాతి రకాల ఆవులున్నాయి. వీటితోనే రోజుకు 650 లీటర్ల పాలను కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వారికి అందిస్తుంది. నెలవారీ ఆదాయం దాదాపు 7 లక్షల రూపాల వరకూ పొందుతోంది. సీజన్ ను బట్టి లాభాల మార్జిన్ మారుతుంది. వేసవిలో సిబ్బంది జీతాలతో పాటు మండ్య, చుట్టుపక్కల జిల్లాల నుంచి పశుగ్రాసం కొనుగోలుకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ వర్షాకాలంలో కౌలుకు తీసుకున్న భూమిలో పశుగ్రాసం సాగు చేయడం వల్ల ఈ ఖర్చులు కాస్త తగ్గుతాయి.

గత కొన్ని సంవత్సరాలుగా పాదం, నోటి వ్యాధి, లంపి చర్మ వ్యాధి వ్యాప్తి చెందడం కాస్త భయానికి లోను చేసాయి. అయినా ఆ పరిస్థితులను దాటి వచ్చింది రాజేశ్వరి. ఈ ప్రమాదాన్ని దాటేందుకు పశుసంవర్ధక, పశువైద్య విభాగం కూడా సకాలంలో టీకాలు వేయించింది. రాజేశ్వరి సాధించిన విజయాలు రెండు కన్నడ రాజ్యోత్సవ తాలూకా-స్థాయి అవార్డులు, ఆరు KMF తాలూకా-స్థాయి అవార్డులు, పాడిపరిశ్రమలో ఉత్తమ మహిళగా నాలుగు జిల్లా స్థాయి అవార్డులతో గుర్తింపు పొందేలా చేసాయి.

Updated Date - Jan 26 , 2024 | 12:53 PM