Funny Helmet Video: హెల్మెట్ తయారు చేసే కంపెనీలకు సవాల్.. ఈ వ్యక్తి పెట్టుకున్న హెల్మెట్ చూస్తే..
ABN , Publish Date - Mar 21 , 2025 | 06:17 PM
సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకే కొందరు విచిత్రమైన ఐడియాలతో ఫన్నీ వీడియోలు రూపొందిస్తున్నారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ జనాలను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా, మరికొన్ని ఆసక్తికరంగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకే కొందరు విచిత్రమైన ఐడియాలతో ఫన్నీ వీడియోలు (Funny Videos) రూపొందిస్తున్నారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ జనాలను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Video).
love.connection అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ రోడ్డు మీద ఇద్దరు వృద్ధులు స్కూటీ (Scooty) నడుపుకుంటూ వెళ్తున్నారు. స్కూటీ నడుపుతున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకున్నాడు. ఆ హెల్మెట్ (Helmet)ను చూసి అందరూ నవ్వుకుంటున్నారు. ఎందుకంటే అతడి తలపై ఉన్నది నిజమైన హెల్మెట్ కాదు. వంటింట్లో ఉపయోగించే పాత్రను హెల్మెట్‌లా తన తలపై పెట్టుకున్నాడు. అది కింద పడిపోకుండా తాళ్లతో కట్టాడు. హెల్మెట్ లేకపోవడంతో అతడు ఈ రకమైన ఏర్పాటు చేశాడు.
ఆ విచిత్రమైన హెల్మెట్‌ను రోడ్డు మీద వెళ్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఆ వీడియోను ఇప్పటివరకు లక్షల మంది వీక్షించారు. 9 వేల మందికి పైగా ఆ వీడియోను చూసి లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేశారు. దీనిని చూసి మొత్తం హెల్మెట్ ఇండస్ట్రీ భయపడుతోందని ఒకరు కామెంట్ చేశారు. చాలా గొప్ప ఐడియా ఇచ్చినందుకు థ్యాంక్స్ అంకుల్ అంటూ మరొకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Viral Funny Video: ఓర్నీ.. హోమ్ డెలివరీ అంటే ఇదేనా.. వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు..
Viral Video: వీళ్లను ఎవ్వరూ కాపాడలేరు.. ఓ యువతి రైల్వే స్టేషన్‌లో అందరి ముందు ఏం చేసిందో చూడండి..
IQ Puzzle: మీరు నిజంగా జీనియస్ అయితే.. ఈ ట్యాంకుల్లో ముందుగా ఏది నిండుతుందో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..