Share News

Viral Video: పాకిస్తాన్ పరిస్థితి మరీ ఘోరం.. పెద్ద గుంత నుంచి మనుషులు బయటకు ఎలా వస్తున్నారో చూడండి..

ABN , Publish Date - Oct 04 , 2024 | 10:45 AM

మన దేశంలో రోడ్ల పరిస్థితికి సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రధాన నగరాల్లోని రోడ్లు కూడా కుంగిపోయి కార్లు, బైక్‌లు గుంతల్లో కూరుకుపోయిన చాలా వీడియోలు ఇటీవల నెట్టింట హల్‌చల్ చేశాయి. మనదేశంలోనే కాదు.. పాకిస్తాన్‌లో కూడా ఇదే పరిస్థితి.

Viral Video: పాకిస్తాన్ పరిస్థితి మరీ ఘోరం.. పెద్ద గుంత నుంచి మనుషులు బయటకు ఎలా వస్తున్నారో చూడండి..
car got submerged in a big pothole

వర్షాకాలం (Rainy season) వచ్చిందంటే రోడ్లకు ఆయువు మూడినట్టే. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి వేసిన రోడ్లు అయినా కొట్టుకుపోవాల్సిందే. వాహనదారులు గాయపడాల్సిందే. మన దేశంలో రోడ్ల (Roads) పరిస్థితికి సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రధాన నగరాల్లోని రోడ్లు కూడా కుంగిపోయి కార్లు, బైక్‌లు గుంతల్లో కూరుకుపోయిన చాలా వీడియోలు ఇటీవల నెట్టింట హల్‌చల్ చేశాయి. మనదేశంలోనే కాదు.. పాకిస్తాన్‌లో (Pakistan) కూడా ఇదే పరిస్థితి. నిజం చెప్పాలంటే మన దేశంలో కంటే పాకిస్తాన్ రోడ్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే షాక్ అవక తప్పదు (Viral Video).


పాకిస్తాన్‌లోని పెద్ద నగరం అయిన లాహోర్‌ (Lahore)లో జరిగిన ఈ దుర్ఘటన చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. లాహోర్‌లోని జోహార్ టౌన్ ప్రధాన రహదారిపై పెద్ద గుంత (pothole) ఏర్పడడం చాలా మందికి షాక్ కలిగిస్తోంది. ఆ గుంతలోకి ఓ కారు దూసుకెళ్లిపోయింది. రెండు బైక్‌లు కూడా ఆ గుంతలో పడిపోయాయి. గుంతలో పడిన మనుషులను నిచ్చెన సహాయంతో స్థానికులు బయటకు లాగారు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడినట్టు సమాచారం. ఈ రహదారిలోని కొన్ని భూగర్భ మురుగు కాలువల్లో లీకేజీ వల్ల ఈ సింక్‌హోల్ ఏర్పడిందని చెబుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే గతంలో కూడా ఇదే స్థలంలో పెద్ద గొయ్యి ఏర్పడింది.


గతేడాది కూడా ఇదే స్థలంలో ఇదే తరహాలో గొయ్యి ఏర్పడింది. ఆ సమయంలో కూడా కారుతో పాటు ఓ కుటుంబం ప్రమాదానికి గురైంది. ఇది మాత్రమే కాదు.. ఇటీవలి కాలంలో పాకిస్తాన్‌లోని చాలా ప్రాంతాల్లోని రోడ్లు కుంగిపోతున్నాయి. గత కొన్ని నెలల్లో రోడ్డుపై ఏర్పడిన నాలుగో పెద్ద గుంత ఇదని స్థానికులు చెబుతున్నారు. ఆ వీడియోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎన్ని ప్రమాదాలు జరిగి ఎందరు గాయపడుతున్నా ప్రభుత్వ అధికారుల్లో కదలిక రాకపోవడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

IQ Test: మీ తెలివికి సవాల్.. ఈ ఫుట్‌బాల్ గేమ్‌లోని తప్పును 10 సెకెన్లలో కనుక్కోండి..


Viral Video: నర్సరీ టీచర్ల అంకిత భావానికి హ్యాట్సాఫ్.. ఫన్నీ టమాటా రైమ్ వీడియో వైరల్..

Viral Video: వామ్మో.. ఇతనెక్కడి జాంబీ టీచర్.. పిల్లలకు పాఠాలు ఎలా చెబుతున్నాడో చూడండి.. వీడియో వైరల్..

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 04 , 2024 | 10:45 AM