Share News

Viral: భారతీయులు రోజుకు రూ.600 పొదుపు చేయాలన్న బిలియనీర్‌పై ఘాటు విమర్శలు!

ABN , Publish Date - Sep 19 , 2024 | 08:39 PM

భారతీయులు రోజుకు రూ.600 పొదుపు చేయాలంటూ బిలియనీర్, వ్యాపారవేత్త హర్ష గోయెంకా చేసిన సూచనపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సగటు భారతీయుడి వాస్తవ పరిస్థితి గోయెంకాకు అవగాహన లేదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

Viral: భారతీయులు రోజుకు రూ.600 పొదుపు చేయాలన్న బిలియనీర్‌పై ఘాటు విమర్శలు!

ఇంటర్నెట్ డెస్క్: భారతీయులు రోజుకు రూ.600 పొదుపు చేయాలంటూ బిలియనీర్, వ్యాపారవేత్త హర్ష గోయెంకా చేసిన సూచనపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సగటు భారతీయుడి వాస్తవ పరిస్థితిపై ఆయనకు అవగాహన లేదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు (Viral).

Anand Mahindra: మానవాళికి ఎలాన్ మస్క్ ఇచ్చే అతిపెద్ద గిఫ్ట్! ఆనంద్ మహీంద్రా ప్రశంస!


ఆన్‌లైన్‌లో నిత్యం యాక్టివ్‌గా ఉండే వ్యాపారవేత్తల్లో హర్షగోయెంకా ఒకరు. ఆయన ఆర్‌పీజీ గ్రూప్‌కు చైర్‌పర్సన్. వ్యాపారమెళకువలు, జీవనశైలికి సంబంధించిన పలు ఆసక్తికర అంశాలు తన ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆయన..జీవితాన్ని మేలిమలుపు తిప్పే అలవాట్లపై ప్రజలకు సలహా ఇచ్చారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

‘‘రోజుకు రూ.600 పొదుపు చేస్తే సంవత్సరం తిరిగేసరికల్లా అది రూ.2,19,000 అవుతుంది. రోజుకు 20 పేజీలు చదివితే సంవత్సరానికల్లా 30 పుస్తకాలు పూర్తి చేయొచ్చు. రోజుకు కసీనం 10 వేల అడుగులు వేస్తే సంవత్సరానికి 70 మారథాన్లు పూర్తి చేసినట్టు అవుతుంది. కాబట్టి, అలవాట్లు చిన్నవని తక్కువ అంచనా వేయొద్దు’’ అని అన్నారు.

Viral: విద్యార్థుల గొడవ.. టీచర్ పరిగెత్తుకుంటూ క్లాస్‌రూంలోకి వెళితే..


అయితే, రోజుకు రూ.600 పొదుపు చేయాలన్న సూచనపై నెటిజన్లు మండిపడుతున్నారు. అనేక మంది భారతీయులు రోజుకు రూ.600 కూడా సంపాదించలేక ఇబ్బంది పడుతున్నారని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. కేవలం పొట్టపోసుకునేందుకు రోజులో 15 గంటలు గడిచిపోతున్నాయని, ఇక 20 పేజీలు, 10 వేల అడుగులు వేసే టైం ఎక్కడుందని ప్రశ్నించారు. భారత్‌లో అతికొద్ది మందికి మాత్రమే ఆయన సూచనలు వర్తిస్తాయని అన్నారు. ‘‘భారత్‌లో 70 శాతం మంది రోజుకు ఇంతకంటే తక్కువే సంపాదిస్తున్నారు. ఇలాంటి బడాయి మాటలు కట్టిపెట్టాలి’’ అని మరో వ్యక్తి కామెంట్ చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ ఈ ఉదంతం వైరల్ అవుతోంది.

Russia: ఆఫీసుల్లో శృంగారంలో పాల్గొనండి.. రష్యా అధ్యక్షుడి కొత్త సూచన!

Read Latest and Viral News

Updated Date - Sep 19 , 2024 | 08:45 PM