Share News

Viral Video: పిల్లిని ఎత్తుకెళ్లాలని వచ్చిన డేగ.. చివరికి ఎలా ఫూల్ అయిందో చూడండి..

ABN , Publish Date - Jan 03 , 2024 | 08:12 PM

డేగ చూపు ఎంత తీక్షణంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆకాశంలో ఎగురుతూనే నేలపై ఉన్న చిన్న చిన్న జీవులనూ పసి గట్టి క్షణాల్లో నోట కరుచుకుని వెళ్లిపోతుంటాయి. ఒక్కసారి వాటి కన్ను పడిదంటే..

Viral Video: పిల్లిని ఎత్తుకెళ్లాలని వచ్చిన డేగ.. చివరికి ఎలా ఫూల్ అయిందో చూడండి..

డేగ చూపు ఎంత తీక్షణంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆకాశంలో ఎగురుతూనే నేలపై ఉన్న చిన్న చిన్న జీవులనూ పసి గట్టి క్షణాల్లో నోట కరుచుకుని వెళ్లిపోతుంటాయి. ఒక్కసారి వాటి కన్ను పడిదంటే.. ఇక వాటి బారి నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. అయితే అప్పుడప్పుడూ వాటికీ కాలం ఎదురుతిరుగుతుతుంటుంది. కొన్నిసార్లు నోటిదాకా వచ్చిన ఆహారం కూడా చేజారిపోతుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ డేగ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పిల్లిని ఎత్తుకెళ్లాలని వచ్చిన డేగ చివరకు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. నగరంలోకి వచ్చిన ఓ డేగ.. ఆహారం కోసం తిరుగుతూ తిరుగుతూ ఓ గోడపై వాలుతుంది. అక్కడి నుంచి చుట్టూ తనకు ఏదైనా ఆహారం దొరుకుతుందేమో అని చూస్తూ ఉంటుంది. ఇంతలో కాస్త దూరంలో కారు ఆగి ఉంటుంది. అందులో ఓ పిల్లి కూడా ఉంటుంది. అంత దూరంలో ఉన్న కారులోని పిల్లిని డేగ ఇట్టే పసిగట్టేస్తుంది. చూడగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. వేటకు సన్నద్ధమవుతుంది. రివ్వున ఎగిరి వచ్చి కారుపై వాలుతుంది. కారు అద్దానికి అటు వైపు ఉన్న పిల్లిని (eagle trying to attack a cat) చూసి దాడి చేయాలని ప్రయత్నిస్తుంది.

Elephant: తప్పిపోయిన పిల్ల ఏనుగును తల్లి వద్దకు చేర్చగానే.. ఫారెస్ట్ సిబ్బందికి కనిపించిన అరుదైన దృశ్యం..

అయితే కారు అద్దం అడ్డుగా ఉండడంతో ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాదు. దీంతో డేగ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ‘‘ఇదేంటీ విచిత్రంగా ఉందే.. ఎంత ప్రయత్నించినా.. ఏదో అడ్డుపడుతోందే’’.. అని అనుకుందే ఏమో గానీ .. కాసేపటి తర్వాత అక్కడి నుంచి నిరాశగా మళ్లీ గోడపైకి ఎగిరి వెళ్తుంది. డేగను చూసి భయపడిపోయిన పిల్లి కారు స్పీడో మీటర్ బోర్డులోకి దూరి దాక్కుంటుంది. ఈ ఘటనను మొత్తం కారు యజమాని వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘డేగ ఆకలికి గండి కొట్టిన కారు’’.. అంటూ కొందరు, ‘‘పాపం పిల్లి.. తెగ భయపడిపోయింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: పాము, ముంగిస మధ్య వెరైటీ ఫైట్.. చివరకు ముంగిస చేసిన పని చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు..

Updated Date - Jan 03 , 2024 | 08:16 PM