Hair Care: కొబ్బరినూనెలో వీటిని కలిపి రాస్తే చాలు.. జుట్టు ఎంత బలంగా మారుతుందంటే..! | Hair Care: use coconut oil with these things for strong and long hair srn spl
Share News

Hair Care: కొబ్బరినూనెలో వీటిని కలిపి రాస్తే చాలు.. జుట్టు ఎంత బలంగా మారుతుందంటే..!

ABN , Publish Date - Jun 19 , 2024 | 04:47 PM

జుట్టు సంరక్షణ చర్యలలో కొబ్బరి నూనె పాత్ర చాలా పెద్దది. ప్రతి మహిళ కనీసం వారంలో రెండు నుండి మూడు సార్లు అయినా తలకు కొబ్బరి నూనె పెడుతూ ఉంటుంది. ఇది జుట్టు పొడిబారడాన్ని నివారిస్తుంది. జుట్టు రాలడాన్ని అరికడుతుంది. అలాగే జుట్టు పెరుగుదలకు దోహదపడుతుంది. కానీ చాలామంది మహిళలు కొబ్బరినూనె వాడినా జుట్టు పెరుగుదలలో అంత మెరుగైన ఫలితాలు కనిపించడం లేదని అంటుంటారు.

Hair Care: కొబ్బరినూనెలో వీటిని కలిపి రాస్తే చాలు.. జుట్టు ఎంత బలంగా మారుతుందంటే..!

జుట్టు సంరక్షణ చర్యలలో కొబ్బరి నూనె పాత్ర చాలా పెద్దది. ప్రతి మహిళ కనీసం వారంలో రెండు నుండి మూడు సార్లు అయినా తలకు కొబ్బరి నూనె పెడుతూ ఉంటుంది. ఇది జుట్టు పొడిబారడాన్ని నివారిస్తుంది. జుట్టు రాలడాన్ని అరికడుతుంది. అలాగే జుట్టు పెరుగుదలకు దోహదపడుతుంది. కానీ చాలామంది మహిళలు కొబ్బరినూనె వాడినా జుట్టు పెరుగుదలలో అంత మెరుగైన ఫలితాలు కనిపించడం లేదని అంటుంటారు. జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా పెరగాలంటే కొబ్బరినూనెను వాడేవిధానం సరిగ్గా తెలుసుకోవాలి. కొబ్బరి నూనె ఒకటే అయినా వాడచ్చు.. అలా కాకుండా అందులో కొన్ని పదార్థాలు కలిపి కూడా వాడచ్చు. అవేంటో తెలుసుకుంటే..

పచ్చిపాలు ముఖానికి రాస్తే జరిగే మ్యాజిక్ ఇదే..!

ABN ఛానల్ ఫాలో అవ్వండి

కొబ్బరి నూనె ఎలా వాడాలి?

ఒక గిన్నెలో కొబ్బరి నూనె తీసుకుని కొద్దిగా వేడి చేయాలి. ఈ నూనెను అరచేతికి పట్టుకుని తలకు పట్టించి సున్నితంగా మసాజ్ చేయాలి. కొబ్బరినూనెను జుట్టుకు పట్టించి, ఒకటిన్నర గంట తర్వాత తలస్నానం చేయవచ్చు. లేదంటే కొబ్బరినూనెను జుట్టుకు పట్టించి రాత్రంతా అలాగే ఉంచుకుని మరుసటిరోజు తలస్నానం చేయవచ్చు. కానీ జుట్టు ఎక్కువగా జిడ్డుగా ఉంటే కొబ్బరి నూనెను రాత్రంతా అప్లై చేయడం మంచిది కాదు. ఎందుకంటే ఇది తలలో రంధ్రాలు మూసుకుపోయేలా చేస్తుంది.

కొబ్బరినూనె, కరివేపాకు..

కొబ్బరినూనె, కరివేపాకులను కలిపి జుట్టుకు రాసుకుంటే జుట్టు విపరీతంగా పల్చబడటం అనే సమస్య దూరమవుతుంది. 2 చెంచాల కొబ్బరి నూనెను మంటపై ఉంచాలి. అందులో 10 నుండి 12 కరివేపాకులను వేసి ఆకులు వేగిన తర్వాత మంటను ఆపివేయాలి. ఇలా తయారు చేసుకున్న నూనెను 20 నిమిషాల పాటు అలాగే ఉంచి తలకు పట్టించాలి. ఈ నూనెను తలకు పట్టించి 45 నిమిషాల నుండి 2 గంటల వరకు అలాగే వదిలేయాలి. తరువాత జుట్టును శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల జుట్టు పెరగడమే కాకుండా జుట్టు నెరసిపోయే సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

రక్తాన్ని శుద్ది చేసే సూపర్ ఫుడ్స్ లిస్ట్ ఇదీ..!


కొబ్బరినూనె, పాలు, అరటిపండ్లు..

కొబ్బరినూనె, పాలు, అరటిపండ్లతో హెయిర్ మాస్క్ తయారుచేసి వాడొచ్చు. హెయిర్ మాస్క్‌ని జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు పొడవుగా పెరుగుతుంది. మృదువుగా మారుతుంది, జుట్టు మెరుస్తుంది. హెయిర్ మాస్క్ కొసం కొబ్బరి నూనెలో కొద్దిగా పాలు, అరటిపండ్ల గుజ్జు వేసి పేస్ట్ చేయాలి. ఈ హెయిర్ మాస్క్‌ను తలకు పట్టించి ఒక గంట పాటు అలాగే ఉంచాలి. గంట తరువాత తలస్నానం చెయ్యాలి. జుట్టు చాలా మృదువుగా మారుతుంది. జుట్టుకు పూర్తి పోషణ కూడా లభిస్తుంది. ఈ హెయిర్ మాస్క్ ను 15 రోజులకు ఒకసారి జుట్టుకు అప్లై చేయవచ్చు.

పచ్చిపాలు ముఖానికి రాస్తే జరిగే మ్యాజిక్ ఇదే..!

రక్తాన్ని శుద్ది చేసే సూపర్ ఫుడ్స్ లిస్ట్ ఇదీ..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jun 19 , 2024 | 04:47 PM