Viral: ఈ పెద్దాయనను చూడండి! వీధుల్లో ట్రాఫిక్ పోలీసులు ఎదురుపడితే..
ABN , Publish Date - Apr 02 , 2024 | 05:16 PM
మండు టెండలో విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసులకు పెద్దాయన సర్‌ప్రైజ్
ఇంటర్నెట్ డెస్క్: ఓవైపు మండే ఎండలు.. మరోవైపు తీవ్ర నీటి ఎద్దడి వెరసి బెంగళూరు (Bengaluru) ప్రజలు నానా అవస్థలూ పడుతున్నారు. ఇంటి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. పోలీసులు, ఇతర అత్యవసర సిబ్బంది మాత్రం ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే తమ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే, ఇంతటి ఎండల్లో ట్రాఫిక్ పోలీసులు పడే శ్రమ ఓ పెద్దాయనను కదిలించింది. వారికి కొంతైనా ఉపశమనం కలిగించేందుకు అతడు చేస్తున్న పని ప్రస్తుతం నెట్టింట వైరల్ (Viral Video) అవుతోంది.
Viral: అర్ధరాత్రి విమానం దిగిన మహిళ..ఎయిర్‌పోర్టులో క్యాబ్ బుక్ చేస్తే..
శ్రీరామ్ బిష్ణోయ్ అనే వ్యక్తి ఈ వీడియోను నెట్టింట షేర్ చేశారు. వీడియోలో పెద్దాయన తన స్కూటీపై మినరల్ వాటర్ బాటిల్స్ తీసుకుని వెళుతూ కూడళ్ల వద్ద ట్రాఫిక్ పోలీసులకు వాటిని పంచుతున్నారు. ఓ మహిళా ట్రాఫిక్ పోలీసులు ఇలాగే ఓ వాటర్ బాటిల్ ఇచ్చాడు. ఆమె పక్కనే ఉన్న మరో పోలీసు కూడా వచ్చి ఓ బాటిల్‌ను తీసుకున్నాడు. ఇలా ఎండవేళల్లో వీధుల్లో ప్రయాణిస్తూ పోలీసులకు వాటర్ బాటిళ్లు పంచుతున్నారా పెద్దాయన. ఇది ఆయన నిత్యం చేసే సేవ అని వీడియో పంచుకున్న నెటిజన్ కామెంట్ చేశారు (Elderly man distributing water to traffic cops).
Viral: ప్రతి ఆసుపత్రిలో ఇలాంటి నర్సు ఉంటేనా.. వైరల్ వీడియో!
మరోవైపు, నెటిజన్లు కూడా వీడియోలోని పెద్దాయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎటువంటి పొగడ్తలు లేదా గుర్తింపు ఆశించకుండా సమాజం కోసం పాటు పడే వాళ్లే అసలైన హీరోలంటూ మెచ్చుకున్నారు. ఇలాంటి వాళ్లు తమకూ నిత్యం ఎదురవుతుంటారని కొందరు నెటిజన్లు చెప్పుకొచ్చాడు. ఓసారి బైక్‌పై వెళుతుండగా పెట్రోల్ అయిపోతే మరో వాహనదారుడు తన వద్ద ఉన్న పెట్రోల్ ఇచ్చాడని ఓ వ్యక్తి చెప్పాడు. తన వద్ద నిత్యం ఓ బాటిల్‌లో పెట్రోల్ పెట్టుకుంటానని అవసరమైన వారికి ఇలా ఇస్తుంటానని అతడు తెలిపినట్టు ఆ నెటిజన్ వివరించాడు.
Viral: కూతురు లండన్ నుంచి విదేశీ ప్రియుణ్ణి ఇంటికి తీసుకొస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి