Share News

Civil Aviation: విమానాలు గరిష్ఠంగా ఎంత ఎత్తులో ప్రయాణించగలవో తెలుసా?

ABN , Publish Date - Sep 22 , 2024 | 05:35 PM

విమానం ఎంత ఎత్తులో వెళ్లాలనేది పలు అంశాలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వాతావరణం, విమానం మోడల్, గమ్యస్థానం ఎంత దూరంలో ఉంది అనే అంశాలు విమానమార్గం ఎత్తును నిర్ణయిస్తాయని వివరిస్తున్నారు.

Civil Aviation: విమానాలు గరిష్ఠంగా ఎంత ఎత్తులో ప్రయాణించగలవో తెలుసా?

ఇంటర్నెట్ డెస్క్: ఒకప్పుడు విమానాలంటే లగ్జరీ కానీ ఇప్పుడు సామాన్య విషయంగా మారిపోయింది. ఓ మోస్తరు సంపాదన ఉన్న వాళ్లు కూడా ఇప్పుడు విమాన ప్రయాణాలను ఎంజాయ్ చేయొచ్చు. అయితే, విమానంలో ప్రయాణించిన ప్రతీసారి మనసులో అనేక సందేహాలు మెదులుతుంటాయి. అసలు విమానం గరిష్ఠంగా ఎంత ఎత్తులో ప్రయాణించగలదనేది చాలా మందికి కలిగే సందేహం. ఇది విమానం మోడల్, ప్రయాణించే మార్గం, వాతావరణ పరిస్థితులు తదితరాలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు (Viral).

Legal Awareness: భారతీయ మహిళలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన టాప్ 5 చట్టాలు!


నిపుణులు చెప్పే దాని ప్రకారం, కమర్షియల్ విమానాలు సాధారణంగా 30 నుంచి 35 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుంటాయి. అయితే, కొన్ని రకాల బోయింగ్, ఎయిర్‌బస్ విమానాల మోడళ్లు గరిష్ఠంగా 41 వేల నుంచి 43 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించగలవు. ఇక ప్రైవేట్ జెట్స్ కొన్ని గరిష్ఠంగా 51 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించగలిగినా కూడా 45 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తాయి (This Is The Maximum Height To Which Planes Can Fly).

Viral: ఢిల్లీలో పర్యటిస్తూ భారత్‌పై బ్రిటీషర్ అవాకులు చవాకులు! వీడియో వైరల్

విమానం ఎంత ఎత్తులో ప్రయాణించాలనేది దాని గమ్యస్థానం ఎంత దూరంలో ఉందనే అంశంపై ఆధారపడి ఉంటుంది. తక్కువ దూరం ప్రయాణించే విమానాలు 25 వేల నుంచి 35 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తాయి. సుదూరాలు వెళ్లే విమానాలు మాత్రం 35 వేల నుంచి 40 వేల అడుగుల ఎత్తులో వెళతాయి. ఎక్కువ ఎత్తున ఉన్న మార్గాల్లో గాలీ పీడనం తక్కువగా ఉంటుందని, ఫలితంగా విమానానికి ఎదురుగాలుల సమస్య తగ్గి ఇంధనం ఆదా అవుతుందని వైమానిక రంగ నిపుణులు చెబుతున్నారు. అయితే, ఏ విమానం ఎంత ఎత్తులో ప్రయాణించేది సివిల్ ఏవియేషన్ నియంత్రణ సంస్థలు నిర్ణయిస్తాయి. ఇక మిలిటరీ విమానాలు మాత్రం ఏకంగా 50 వేల నుంచి 70 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించగలవు.

Viral: వేట అంటే ఇదీ..ఈ పక్షి టాలెంట్ పీక్స్! చూసి తీరాల్సిన వీడియో!


ప్రతికూల వాతావరణాన్ని తప్పించుకునేందుకూ విమానాలు ఎక్కువ ఎత్తులో ప్రయాణిస్తాయని నిపుణులు చెబుతున్నారు. తక్కువ ఎత్తులో సాధారణంగా గాల్లో తేమ ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా మేఘాలు ఏర్పడతాయి. అంతేకాకుండా, తక్కువ ఎత్తులోని అధిక గాలి పీడనం, తేమ కారణంగా విమానం కుదుపులకు లోనవుతుంది. దీన్ని టర్బులెన్స్ అంటారు. టర్బులెన్స్ కారణంగా విమానంలోపల ఉన్న ప్రయాణికులు మాటమాటికీ కుదుపులకు లోనై ఇబ్బంది పడతారు. కాబట్టి, మేఘాల నుంచి తప్పించుకునేందుకు విమానాలు వాటి కంటే ఎత్తులో వెళుతుంటాయి. 40 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించే విమానాలకు టర్బులెన్స్ బెడద ఉండదని నిపుణులు చెబుతున్నారు. మేఘాలు ఇంతకంటే తక్కువ ఎత్తులోనే ఉంటాయని అంటున్నారు.

Read Latest and Viral News

Updated Date - Sep 22 , 2024 | 05:46 PM