Viral Video: హాస్టల్‌లో ఉంటే ఇలాంటివి తప్పవు.. చపాతీతో నూడిల్స్ ఎలా తింటోందో చూడండి.. వీడియో వైరల్..
ABN , Publish Date - Sep 14 , 2024 | 07:53 PM
అవసరం ఎన్నో విద్యలను నేర్పిస్తుంది. ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేయిస్తుంది. పెద్ద పెద్ద సమస్యలకు సులభమైన పరిష్కారాలు కనుగొనేలా చేస్తుంది. అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
అవసరం ఎన్నో విద్యలను నేర్పిస్తుంది. ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేయిస్తుంది. పెద్ద పెద్ద సమస్యలకు సులభమైన పరిష్కారాలు కనుగొనేలా చేస్తుంది. అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు (Jugaad Videos) ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలోని ఓ హాస్టల్ అమ్మాయి (Hostel Girl) ఆలోచన చాలా మందికి షాకిచ్చింది. సాధారణంగా హాస్టల్ ఫుడ్ (Hostel Food) చాలా మందికి రుచించదు. దీంతో చాలా మంది బయట తినేస్తుంటారు. అయితే ఈ వీడియోలోని అమ్మాయి మాత్రం వెరైటీగా తన ఆకలి తీర్చుకుంది (Viral Video).
myself_devyani అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. సాధారణంగా చపాతీలు చేసుకోవడం సులభమే. కానీ, చపాతీలతో (Roti) పాటు తినడానికి కూర చేసుకోవడం కొద్దిగా కష్టం. ఆ కష్టానికి ఈ వీడియోలోని యువతి సులభమైన పరిష్కారం కనుగొంది. చాలా సులభంగా తయారైపోయే మ్యాగీ నూడిల్స్ (Maggi Noodles) చేసుకుని, వాటిని చపాతీలతో కలిపి తినడం మొదలుపెట్టింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ అమ్మాయి ట్రిక్కు చూసి చాలా మంది అవాక్కవుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు లక్షల మంది వీక్షించారు. దాదాపు 34 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇలా తినడానికి చాలా క్రియేటివిటీ కావాలి``, ``మ్యాగీని ఇండియన్స్ ఎలాగైనా తినేస్తారు``, ``బ్యాచిలర్స్‌కు గొప్ప సలహా``, ``హాస్టల్స్‌లో ఉండే వారికి ఇలాంటివి తప్పవు`` అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral: నేను పెళ్లి చేసుకుంటున్నా.. ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి వెళ్లిన మహిళా ఉద్యోగిపై ఫన్నీ ఫ్రాంక్..
Viral Video: అంబులెన్స్‌ను వెంటాడిన కుక్క.. కారణం ఏంటో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
Viral: ఓర్నీ.. లీవ్‌లెటర్ ఇలా ఎవరైనా రాస్తారా? స్టూడెంట్ రాసిన లెటర్ చూసి అవాక్కైన టీచర్..
Optical Illusion: మీ కళ్లకు నిజమైన పరీక్ష.. ఈ ఫొటోలో భిన్నంగా ఉన్న నెంబర్ ఎక్కడుందో కనుక్కోండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..