Viral Video: బాబోయ్..! ఇదెక్కడి మాయాజాలం.. చూస్తుండగానే అన్నీ మాయం చేసిందిగా.. | young woman experiment with the help of 3D technology video is going viral kjr spl
Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Viral Video: బాబోయ్..! ఇదెక్కడి మాయాజాలం.. చూస్తుండగానే అన్నీ మాయం చేసిందిగా..

ABN , Publish Date - Mar 02 , 2024 | 05:11 PM

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో టాలెంట్ ఉండాలే గానీ.. ఉపాధికి కొదవే లేదు. కొందరు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని ఇంట్లో కూర్చునే లక్షలు సంపాదిస్తున్నారు. మరికొందరు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతున్న టెక్నాలజీతో...

Viral Video: బాబోయ్..! ఇదెక్కడి మాయాజాలం.. చూస్తుండగానే అన్నీ మాయం చేసిందిగా..

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో టాలెంట్ ఉండాలే గానీ.. ఉపాధికి కొదవే లేదు. కొందరు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని ఇంట్లో కూర్చునే లక్షలు సంపాదిస్తున్నారు. మరికొందరు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతున్న టెక్నాలజీతో సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇంకొందరు తమ తెలివితేటలకు పదునుపెట్టి వినూత్న వీడియోలు తీస్తూ తద్వారా ఆదాయం గడిస్తున్నారు. ఇలాంటి ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువతి త్రీడీ టెక్నాలజీతో సాయంతో చేసిన మాయాజాలం అందరినీ ఆకట్టుకుంటోంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి త్రీడీ టెక్నాలజీ (3D technology) సాయంతో సరికొత్త ప్రయోగం చేసింది. ఇంట్లో ఓ కుర్చీ, దాని పక్కనే రెండు మ్యాట్‌లు ఉంటాయి. లోపలికి వచ్చిన యువతి కుర్చీ పైకి ఎక్కి, తర్వాత కింద ఉన్న మ్యాట్‌ను కాస్తా.. ముగ్గు చెరిపేసినట్లు చెరిపేస్తుంది. ఆ తర్వాత ఆమె కూడా బొమ్మలా మారిపోతుంది. అదే సమయంలో అటు వైపు నుంచి అదే యువతి అక్కడికి వస్తుంది.

Viral Video: గ్యాస్ సిలిండర్‌ నుంచి మంటలు.. చిన్న టెక్నిక్ తెలీక వీళ్లు పడ్డ తిప్పలు చూస్తే..

లోపల కుర్చీతో పాటూ నేలపై ఉన్న మ్యాట్, తన బొమ్మను కూడా చెరిపేస్తుంది. చివరగా ఓ చీపురుతో అక్కడున్న కుర్చీని కూడా చెరిపేసి మాయం చేస్తుంది. ఇలా అందుబాటులో ఉన్న త్రీడీ టెక్నాలజీ సాయంతో అద్భుతాన్ని చేసి చూపిస్తుంది. ఇది చూసేందుకు ఏదో మాయాజాలంలా అనిపిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ యువతి టాలెంట్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘త్రీడీ టెక్నాలజీ అద్భుతంగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 10లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: బ్యాడ్మింటన్ ఆడుతున్న యువతిని అడ్డుకున్న వ్యక్తి.. చివరికి అందరికీ ఎలాంటి షాక్ ఇచ్చాడో చూడండి..

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - Mar 02 , 2024 | 05:11 PM