అదరగొట్టిన జంగూ
ABN , Publish Date - Dec 14 , 2024 | 06:12 AM
వికెట్‌కీపర్ బ్యాటర్ ఆమిర్ జంగూ (83 బంతుల్లో 104 నాటౌట్) అరంగేట్రంలోనే సెంచరీతో అదరగొట్టడంతో బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో వెస్టిండీస్ విజయం సాధించింది.
బంగ్లాపై విండీస్ గెలుపు
3-0తో సిరీస్ కైవసం
సెయింట్‌కిట్స్: వికెట్‌కీపర్ బ్యాటర్ ఆమిర్ జంగూ (83 బంతుల్లో 104 నాటౌట్) అరంగేట్రంలోనే సెంచరీతో అదరగొట్టడంతో బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో వెస్టిండీస్ విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీ్‌సను విండీస్ 3-0తో క్లీన్‌స్వీ్‌ప చేసింది. తొలుత బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 321 రన్స్ చేసింది. ఛేదనలో వెస్టిండీస్ 45.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 325 పరుగులతో విజయం సాధించింది. కార్టీ 95 పరుగులు చేశాడు. ఇక ఆమిర్ కేవలం 80 బంతుల్లోనే శతకం పూర్తిచేసి అరంగేట్రంలో వేగంగా సెంచరీ చేసిన వెస్టిండీస్ ఆటగాడిగా రికార్డు పుటల్లోకి ఎక్కాడు. అలాగే వెస్టిండీస్ తరపున ఓపెనర్ డెస్మండ్ హేన్స్ (1978లో) తర్వాత అరంగేట్రంలో సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు.