Share News

Hardik Pandya: బ్రిటీష్ సింగర్‌తో హార్దిక్ పాండ్యా డేటింగ్? ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లతో మొదలైన అనుమానం..!

ABN , Publish Date - Aug 14 , 2024 | 12:35 PM

సెర్బియా నటి, తన భార్య నటాషా స్టాంకోవిచ్ నుంచి గత నెలలో విడాకులు తీసుకున్న టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరొకరితో ప్రేమలో పడ్డాడా? ప్రస్తుతం ఆమెతోనే డేటింగ్ చేస్తున్నాడా? బ్రిటీష్ సింగర్, టీవీ నటి జాస్మిన్ వాలియాతో కలిసి చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నాడా?

Hardik Pandya: బ్రిటీష్ సింగర్‌తో హార్దిక్ పాండ్యా డేటింగ్? ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లతో మొదలైన అనుమానం..!
Hardik Pandya dating with Jasmin Walia

సెర్బియా నటి, తన భార్య నటాషా స్టాంకోవిచ్ (Natasa Stankovic) నుంచి గత నెలలో విడాకులు తీసుకున్న టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) మరొకరితో ప్రేమలో పడ్డాడా? ప్రస్తుతం ఆమెతోనే డేటింగ్ చేస్తున్నాడా? బ్రిటీష్ సింగర్, టీవీ నటి జాస్మిన్ వాలియా (Jasmin Walia)తో కలిసి చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నాడా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానమే వస్తోంది. ప్రస్తుతం జాస్మిన్‌తో కలిసి హార్దిక్ వెకేషన్ మూడ్‌లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి (Hardik Pandya dating).


గ్రీస్‌లోని ఓ హోటల్ స్విమ్మింగ్ పూల్ వద్ద నడుస్తూ తీసుకున్న వీడియోను హార్దిక్ పాండ్యా కొద్ది గంటల క్రితం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. నాలుగు రోజుల క్రితం అదే ప్లేస్‌లో తీసుకున్న వీడియోను జాస్మిన్ వాలియా కూడా తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేసింది. పైగా వాలియా పోస్ట్‌ను హార్దిక్, హార్దిక్ పోస్ట్‌‌ను వాలియా లైక్ చేసుకున్నారు. దీంతో ఆ ఇద్దరూ కలిసే గ్రీస్‌కు విహారయాత్రకు వెళ్లినట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఆ పోస్ట్‌కు మాత్రమే కాదు.. గతంలో కూడా వాలియా పెట్టిన పలు పోస్ట్‌లకు హార్దిక్ లైక్ కొట్టాడు. దీంతో ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని చాలా మంది భావిస్తున్నారు.


ఇంగ్లండ్‌కు చెందిన జాస్మిన్ టీవీ సిరీస్‌లు, పలు రియాలిటీ షోల్లో పాల్గొని పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత స్వంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి పలు ఆల్బమ్‌లను విడుదల చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 6.4 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. కాగా, సెర్బియా నటి నటాషాను 2020లో వివాహం చేసుకున్న హార్దిక్ ఓ బిడ్డకు తండ్రి కూడా అయ్యాడు. కాగా, వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో విడాకుల కోసం అప్లై చేశారు. తాము విడిపోతున్నట్టు గత నెల 19వ తేదీన వీరిద్దరూ ప్రకటించారు.


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 14 , 2024 | 01:50 PM