Gautam Gambhir: గౌతమ్ గంభీర్‌కు బీసీసీఐ షాక్.. కీలక విజ్ఞప్తి తిరస్కరణ!
ABN , Publish Date - Jul 11 , 2024 | 09:38 PM
భారత జట్టు ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్‌ను నియమిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇటీవల ప్రకటన చేసిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచ కప్ 2024తో రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగిసిపోవడంతో ఆయన స్థానంలో గంభీర్‌కు అవకాశం కల్పించారు.
భారత జట్టు ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్‌ను నియమిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇటీవల ప్రకటన చేసిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచ కప్ 2024తో రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగిసిపోవడంతో ఆయన స్థానంలో గంభీర్‌కు అవకాశం కల్పించారు. అయితే గంభీర్ పేరుని ప్రకటించిన నాటి నుంచి కోచింగ్ సహాయక సిబ్బంది ఎంపికపై అనేక కథనాలు వెలువడ్డాయి. తాను సూచించిన వ్యక్తులకే కోచింగ్ సహాయక సిబ్బందిగా అవకాశం ఇవ్వాలంటూ గంభీర్ షరతు విధించాడంటూ పలు నివేదికలు పేర్కొన్నాయి.
అయితే తాజాగా టీమ్ ఇండియాకు ఫీల్డింగ్ కోచ్‌గా జాంటీ రోడ్స్‌ను కావాలంటూ గంభీర్ చేసిన విజ్ఞప్తిని బీసీసీఐ తిరస్కరించినట్టు జాతీయ కథనాలు పేర్కొంటున్నాయి. భారత జట్టు సపోర్ట్ స్టాఫ్ మొత్తం భారతీయులు మాత్రమే ఉండాలని బీసీసీఐ వివరించినట్టు ‘హిందూస్తాన్ టైమ్స్’ కథనం పేర్కొంది.
కాగా రాహుల్ ద్రావిడ్‌తో పాటే బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ పదవీకాలం పూర్తయింది. అయితే సపోర్ట్ స్టాఫ్ మొత్తాన్ని తిరిగి కొనసాగించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు కథనాలు పేర్కొంటున్నాయి. ఇదే నిజమైతే దిలీప్ భారత ఫీల్డింగ్ కోచ్‌గా కొనసాగనున్నారు.
ఇవి కూడా చదవండి
బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బీసీసీఐ.. రంగంలోకి మరో ఇద్దరు మాజీ స్టార్స్
పాపం అభిషేక్.. కెప్టెన్ దెబ్బకు చెత్త రికార్డ్.. కోహ్లీ తర్వాత అతడే!
For More Sports News and Telugu News