IND vs NZ: ఇలా తగులుకున్నాడేంటి.. రెండోసారి సుందర్ చేతికి చిక్కిన రచిన్
ABN , Publish Date - Oct 25 , 2024 | 04:19 PM
చిన్నపాటి నిర్లక్ష్యానికి కివీస్ ఆటగాడు రచిన్ రవీంద్ర భారీ మూల్యం చెల్లించుకున్నాడు. మరోసారి వాషింగ్టన్ సుందర్ చేతికి చిక్కాడు.
పూణె: రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ వాషింగ్టన్ సుందర్ జోరు ఏమాత్రం తగ్గడంలేదు. న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ రచిన్ రవీంద్ర(9)ను రెండో సారి పెవిలియన్ బాట పట్టేలా చేశాడు. 22వ ఓవర్లో సుందర్ వేసిన లెంగ్త్ బాల్ ను ఎదుర్కోబోయిన రచిన్ బ్యాక్‌ఫుట్‌లో కట్ షాట్ ఆడే ప్రయత్నం చేసి బోల్తా కొట్టాడు. బ్యాట్ ను మిస్సైన బంతి వికెట్లకు తగలడంతో బిత్తరపోవడం రచిన్ వంతైంది. దీంతో కేవలం 9 పరుగులు మాత్రమే చేయగలిగాడు. పిచ్ ను సరిగా అంచనా వేయకుండా తొందరపాటుతో రచిన్ మరోసారి బుక్కయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. సుందర్ బౌలింగ్ మాయాజాలం చూసినవారంతా అతడిని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు.
న్యూజిలాండ్ 4వ వికెట్ కోల్పోయిన నేపథ్యంలో వాషింగ్టన్ సుందర్ ఈ మ్యాచ్‌లో 10వ వికెట్‌ను కైవసం చేసుకున్నాడు. న్యూజిలాండ్ ఆధిక్యం 250 పరుగుల మార్కుకు చేరువలో ఉన్నప్పటికీ, టీ బ్రేక్ తర్వాత సుందర్ రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్‌లను అవుట్ చేసి భారత్‌ను పోటీలో ఉంచాడు. టామ్ లాథమ్ హాఫ్ సెంచరీ చేసిన తర్వాత అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అంతకుముందు, న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ విసిరిన సవాలుకు భారత స్టార్-స్టడెడ్ బ్యాటింగ్ లైనప్ నిలబడలేకపోయింది, ఆతిథ్య జట్టు 45.3 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌటైంది, టామ్ లాథమ్ నేతృత్వంలోని జట్టు కీలకమైన మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందించింది. పుణెలో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు శుక్రవారం 103 పరుగులు చేసింది.