IND vs AUS: టీమిండియాకు కొత్త టెన్షన్.. ఆసిస్ ప్లానింగ్ మామూలుగా లేదుగా..
ABN , Publish Date - Dec 09 , 2024 | 02:32 PM
ఇప్పటికే రెండో టెస్టులో ఓటమితో కుదేలై ఉన్న టీమిండియాకు కొత్త టెన్షన్ మొదలైంది. టీమిండియాను చావుదెబ్బ తీసేందుకు ఆస్ట్రేలియా జట్టు మరో కొత్త ప్లాన్ ను అమలు చేయనుంది. భీకర ఫామ్ లో ఉన్న స్టార్ బౌలర్ తో రోహిత్, కోహ్లీ వంటి ఆటగాళ్లకు చెక్ పెట్టనుంది.
ముంబై: ఆడిలైడ్ వేదికగా టీమిండియాకు ఎదురైన ఓటమితో భారత ఆటగాళ్లు మూడో టెస్టుకు మరింత జాగ్రత్తగా సన్నద్ధమవుతున్నారు. మొన్నటి విజయంతో ఈ సిరీస్ లో బోణీ కొట్టిన ఆసిస్ ఇప్పుడు మరింత ఆత్మవిశ్వాసంతో కనపడుతోంది. తాజాగా తన అమ్ములపొది నుంచి మరో అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమైంది. టీమిండియాతో తొలి టెస్టులో గాయం కారణంగా జట్టుకు దూరమైన స్టార్ బౌలర్ జోష్ హేజిల్ వుడ్ రెండో టెస్టులోనూ ఆడలేదు. అయినప్పటికీ ఆసిస్ ఆటగాళ్లు అతడు లేని లోటును తీర్చారు. భారత బ్యాటర్లను ఒక్కొక్కరుగా పెవిలియన్ కు చేర్చుతూ ప్రతీకారం తీర్చుకున్నారు.
ఆసిస్ కొత్త అస్త్రం..
ఇదిలా ఉంటే మరోసారి భారత్ కు ఇరుకున పెట్టేందుకు హేజిల్ వుడ్ ను రంగంలోకి దింపేందుకు ఆసిస్ పావులు కదుపుతోంది. హేజిల్ వుడ్ ను మూడో టెస్టులో ఆడించేందకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. అయితే, అతడు మ్యాచ్ లో పాల్గొంటాడా లేదా అనే విషయం మరో 24 గంటల్లో తేలిపోనుంది. ఒక్క రోజులో అతడు తిరిగి కోలుకుని మళ్లీ జట్టులో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై ఈ ఆటగాడు తాజాగా స్పందించాడు. మరో 24 గంటల్లో నేను బ్రిస్బేన్ కు వస్తానా రానా అనే విషయం తెలిసిపోనుంది. తొందరగా గాయనం నుంచి రికవరీ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. రెండు స్పెల్ఫ్ లు ఆడటం ఒక రిపిటేటివ్ యాక్షన్ లాంటిందే. అయినా అది పెద్ద మార్పులను చేయగలదని తెలుసు. వీలైరంత త్వరగా కోలుకునేందకు ప్రయత్నిస్తు్నా.. అంతా అనుకున్నట్టే జరిగితే బ్రిస్బేన్ మ్యాచ్ లో ఉంటా అని ఈ స్టార్ బౌలర్ తెలిపాడు.
వంద శాతం వచ్చేస్తా..
ఈ సీనియర్ ఆటగాడు ఇంతకు మునుపు కూడా గాయాలపాలయ్యాడు. అయినప్పటికీ పెర్త్ లో జరిగిన టెస్టులో తగిలిన గాయం పెద్దది. ఏదేమైనా ఆడేందుకే తాను ఆసక్తి చూపుతున్నట్టుగా తెలిపాడు. గత గాయాలతో పోలిస్తే ఇది చాలా చిన్నది. అయిన్పటికీ నేను క్రికెట్ ఆడగలుగుతుండటం సంతోషంగా ఉంది. నేను జట్టులో లేకపోయినప్పటికీ నా స్థానంలో స్కాటీ బోలాండ్ అద్భుతంగా ఆడాడు. అతడు ఆడిన ప్రతిసారి అదరగొట్టేశాడు. అతడు జట్టులో ఉండటం వల్ల నేను ఈ నిర్ణయాన్ని మరింత తేలిగ్గా తీసుకోగలిగాను. నేను వంద శాతం మ్యాచ్ ఆడాలనుకుంటున్నాను. ఒకవేళ ఆడలేకపోయినా స్కాట్ కచ్చితంగా సంసిద్ధంగా ఉంటాడని తెలిపాడు. ఇక ప్రస్తుతం అతడి మాటలు వింటుంటే అతడు ఫిట్ గానే ఉన్నట్టు కనిపిస్తున్నాడు. దీంతో టీమిండియాకు కొత్త టెన్షన్ మొదలైనట్టు తెలుస్తోంది.
ఆ ఇద్దరు ఇరకాటంలో..
హేజిల్ వుడ్ బ్రిస్బేన్ లో మొత్తం 8 టెస్టులు ఆడగా.. 23.75 యావరేజ్ తో మొత్తం 37 వికెట్లను తీసిన రికార్డ్ ఉంది. గబ్బా వేదికపైనా ఇతగాడు రెండు 5 వికెట్ హాల్స్ తీశాడు. ఇక పెర్త్ టెస్టులో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ఆటగాళ్లను పరుగులు పెట్టించాడు. ఇప్పుడీ బౌలర్ పునరాగమనం వీరిద్దరికీ పెద్ద తలనొప్పిగా మారనుంది.